E-Paper
Advertisement

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..
Advertisement
china news today
China

China arunachal pradesh news(Today’s breaking news in India): చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పై మరో వివాదాన్ని రేపింది. ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలు తమ దేశంలో భాగంగా పేర్కొంది. వాటికి పేర్లు కూడా పెట్టేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం డ్రాగన్ వివాదాలను రేపుతోంది.

చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు ఇటీవల ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. చైనా తమవిగా పేర్కొన్న వాటిలో 11 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. 12  పర్వతాలు, 4 నదులు, సరస్సు, పర్వత మార్గం, మరో భూభాగం తమవేనని ఆ కథనంలో పేర్కొంది. ఆ 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లు పెట్టిందని తెలుస్తోంది.

Advertisement

అరుణాచల్ ప్రదేశ్ లోని జాంగ్ నన్ ప్రాంతంపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఈ క్రమంలోనే డ్రాగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాంగ్ నన్ లో 30 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

Also Read:  మావల్లే ఆ విషయం బయటకు.. అది తప్పు..

Advertisement

అరుణాచల్‌ ప్రదేశ్‌  తమ దేశంలో భాగమని డ్రాగన్ చాలాకాలంగా వితండవాదం చేస్తోంది. ఈ క్రమంలో ఆ భూభాగాన్ని జాంగ్‌నన్‌ గా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి.  2017లో  6 ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు, 2023 ఏప్రిల్‌లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యవహార శైలిపై భారత్ అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. పేర్లు పెట్టుకున్న మాత్రాన ఆ ప్రాంతాలు చైనాకి చెందవని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని కుండబద్దలు కొట్టింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనపైనా  చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సమయంలో కూడా చైనాకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

Tags

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×