BigTV English

PM Modi Comments on Electoral bonds: మావల్లే ఆ విషయం బయటకు.. అది తప్పు..

PM Modi Comments on Electoral bonds: మావల్లే ఆ విషయం బయటకు..  అది తప్పు..

PM Modi Comments on Electoral bonds


PM Modi Comments on Electoral bonds(Telugu breaking news today): సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై రచ్చ తీవ్రమైంది. దీనిపై బీజేపీలోకి కీలక నేతలు కౌంటరిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. బాండ్లపై వేడి కంటిన్యూ అవుతోంది. ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించారు ప్రధాని నరేంద్రమోడీ. అందరూ బీజేపీ వైపు దృష్టి పెట్టడంతో తొలిసారి నోరువిప్పారు. ఈ అంశం బీజేపీకి ఎదురుదెబ్బగా భావించడం లేదన్నారు ప్రధాని.

ఆదివారం ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు ప్రధాని నరేంద్రమోడీ. బాండ్లు రద్దు చూసి ఎంజాయ్ చేస్తున్న పార్టీలు.. రాబోయే రోజుల్లో పశ్చాత్తాపం పడతారన్నారు. ముఖ్యంగా పార్టీలకు నిధుల రాక గురించి తెలిసిందంటే కేవలం ఎన్నికల బాండ్ల వల్లేనన్నారు. 2014 ముందు ఆ తరహా వివరాలను సేకరించారా అంటూ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. లోపాలు లేని వ్యవస్థలు ఉండవని, కానీ ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలన్నారు.


ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని భావించిన సుప్రీంకోర్టు ఆ స్కీమ్‌ని రద్దు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఆ వివరాలను పబ్లిక్ డొమెన్‌లో ఉంచింది. దీనికి ఆధారంగా కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీలు.. అధికార బీజేపీని టార్గెట్ చేశాయి.

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×