BigTV English

Chiranjeevi: నువ్వేమైనా సూపర్ స్టార్ వా.. ఇక్కడే పడి ఉండు అంటూ అతను అవమానించాడు

Chiranjeevi: నువ్వేమైనా సూపర్ స్టార్ వా.. ఇక్కడే పడి ఉండు అంటూ అతను అవమానించాడు


Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు.. ఎన్నేళ్లు అయినా.. టాలీవుడ్ లో గుర్తిండిపోయే స్టార్ హీరో. టాలీవుడ్ కు ఒక స్టార్ మార్క్ ను క్రియేట్ చేసిన హీరో చిరంజీవి. ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలను లైన్లో పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన సెల్ఫ్ మేడ్ స్టార్. ఆ అవమానాలను ఇప్పుడు ఏ హీరో పడలేదు అని చెప్పొచ్చు.

తాజాగా చిరంజీవి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను అభిమానులతో పంచుకున్నాడు. ఆదివారం.. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ మీట్ లో పాల్గొన్న ఆయన.. తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇప్పుడంటే చిన్న, పెద్ద హీరోలు అయినా నిర్మాతలు కొద్దిగా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. అయితే అప్పట్లో సెట్ లోనే అందరిముందు తిట్టిపోసేవారట. అలా సెట్ లోనే ఒక నిర్మాత చిరును అవమానించినట్లు ఆయన తెలిపారు. అలా అవమానించిన రోజునే తాను స్టార్ కావాలనుకున్నట్లు తెలిపారు.


న్యాయం కావాలి సినిమా సెట్ లో కోర్ట్ సీన్ చేస్తున్నారు. లోపల అందరూ ఉన్నారు.. నేను బయట ఉన్నాను. నన్ను పిలవగానే వెంటనే వచ్చి బోనులో నిలబడ్డాను.అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్.. నన్ను ఎంతగానో అవమానించారు. ఏంటి ..మిమ్మల్ని కూడా స్పెషల్ గా పిలవాలా.. ? ఇక్కడకు వచ్చి పడి ఉండలేరా.. ? మీరేమైనా సూపర్ స్టార్స్ అనుకుంటున్నారా.. ? ఇక్కడ జగ్గయ్య, శారద లాంటి స్టార్లు నిలబడలేదా.. ? అని అరిచేశారు. నా గుండె పిండేసినంత పని అయ్యింది. ఎలాగోలా ఆ సీన్ ను పూర్తిచేసి బయటికి వచ్చేసాను. సెట్ లో అందరూ ఆయన అన్న మాటలు విన్నారు. చాలా బాధగా అనిపించింది. ఆరోజు అన్నం కూడా తినాలనిపించలేదు.

ఇక అప్పుడే ఫిక్స్ అయ్యాను. నేను స్టార్ కావాలి అని.. ఇక ఆ సాయంత్రం నిర్మాత క్రాంతి కుమార్ కాల్ చేసి.. తప్పుగా అనుకోకు.. పని ఒత్తిడి ఎక్కువ ఉండడంతో.. కోపంతో నీ మీద అరిచేసాను అన్నారు. కానీ, అది పద్ధతి కాదు.. అందరిముందు అవమానం జరిగింది. ఆ అవమానం మళ్లీ రీపీట్ అవ్వకూడదు అనుకున్నాను. కసిగా కష్టపడడం మొదలుపెట్టాను. ఆయనపై రివెంజ్ తీర్చుకోకుండా పని మీద శ్రద్ద పెట్టాను.. ఎదగడానికి ఆ మాటలను వాడుకున్నాను. ఇలా నా జీవితంలో చాలా జరిగాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఊరికే మెగాస్టార్లు అయిపోరు.. కష్టం, అవమానం అన్ని పడి నిలబడితే మెగాస్టార్ అవుతారు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×