
Rishabh Pant Fined Rs 12 Lakh For Breaching IPL Code of Conduct: ఐపీఎల్ లో మ్యాచ్ లు మంచి పీక్స్ లో ఉన్నాయి. ఒకొక్కరు విజృంభించి ఆడుతున్నారు. ఆ హీట్ లో టైమ్ సెన్స్ మరిచిపోతున్నారు. ఆల్రడీ శుభ్ మన్ గిల్ రూ.12 లక్షలు కట్టాడు. ఇప్పుడు రిషబ్ పంత్ వంతు అయ్యింది.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రిషబ్ పంత్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కథ ఇంతవరకు బాగానే ఉంది. అందరూ సంతోష సంబరాల్లో మునిగిపోయారు. అప్పుడు అంపైర్లు బాంబ్ పేల్చారు. అదేమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ పొరపాటు కారణంగా కెప్టెన్ కి రూ.12 లక్షల జరిమానా విధించారు.
Also Read: మా ఆయనకి మ్యాచ్ ఓడిపోయినట్టు తెలీదనుకుంటా: సాక్షి ఫన్నీ పోస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పెనాల్టీ పడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 20 ఓవర్లను 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకున్నందుకు పంత్ కు జరిమానా విధించారు.
ఇక్కడ నుంచి జనగణమణ ప్రారంభమవుతుంది. ఎందుకంటే మొదటి తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోని కెప్టెన్ కు తర్వాత కూడా తప్పు చేస్తే పెనాల్టీ డబుల్ అవుతుంది. రూ. 24 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్లేయర్స్ లోని 10 మంది ఆటగాళ్లపై రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు.
మూడోసారి ఇదే తప్పు పునరావృతమైతే జట్టు కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తారు. ఇది కాకుండా మూడుసార్లు ఇలా చేస్తే కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. జట్టులోని 10 మంది ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 10శాతం నుంచి 50 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అది అంపైర్లపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గిల్, పంత్ ఇద్దరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది.