Congress Bharat Jodo yatra latest news : ఆరోజు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలు.. ఎందుకంటే..?

Bharat Jodo yatra update : ఆరోజు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలు.. ఎందుకంటే..?

Congress Bharat Jodo Yatra on September 7
Share this post with your friends

Congress Bharat Jodo yatra latest news

Congress Bharat Jodo yatra latest news(Politics news today India) :

కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రారంభించి సెప్టెంబర్ 7తేదికి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని జిల్లాలో ఈ నెల 7న భారత్ జోడో యాత్రలు చేపట్టాలని శ్రేణులను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేయాలని నిర్దేశించింది.

గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రను ఆరు నెలల పాటు నిర్వహించారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టారు. రాహుల్ గాంధీ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అన్ని వాతావరణ పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని రాహుల్ జనంతో మమేకమయ్యారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి మైలేజ్ వచ్చింది. భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో సంబరాలను నిర్వహించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. రాహుల్ గాంధీ యాత్ర స్టార్ట్ చేసిన సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

BRS Party Updates: ఆ సిట్టింగులకు షాక్!.. ఫస్ట్ లిస్ట్‌పై ఎమ్మెల్యేల్లో టెన్షన్..

Bigtv Digital

Emraan Hashmi : ఒకప్పుడు బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. ఇప్పుడు తెలుగులో విలన్‌గా..

Bigtv Digital

Dharmapuri Temple :- ధర్మపురి దక్షిణాకాశీ ఎలా అయ్యింది..?

Bigtv Digital

KCR: తలపై టోపీ.. కేసీఆర్ కొత్త సెంటిమెంట్ అందుకేనా!?

BigTv Desk

Etela Rajender : బిగ్ బ్రేకింగ్.. ఈటల కాన్వాయ్ పై దాడి.. మునుగోడులో రణరంగం..

BigTv Desk

BRS: రాజయ్యకు అలా.. చిన్నయ్యకు ఇలా.. ఎందుకలా?

Bigtv Digital

Leave a Comment