Congress Party: 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచి పార్టీలు రెడీ అవుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో భారీగా మార్పులు చేర్పులు చేటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. అంతేకాదు రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.కొత్త నియమించిన పార్టీ కార్యదర్శుల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు.
2029 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ. కేవలం మాటలతో మాత్రమే చేతలతో చేసి చూపిస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. సామాజిక మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. పార్టీలో ఎక్కడ మార్పులు జరిగినా అగ్రనేత రాహుల్‌గాంధీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం మొదలు పెట్టింది. కీలక విభాగాలకు కొత్త సారథులను నియమించింది. పాతవారికి చెక్ పెడుతూ యువత, కొత్తవారికి పట్టం కట్టింది.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ రాష్ట్రాలు, సంస్థాగత విభాగాలకు 81 మంది జాతీయ కార్యదర్శులను నియమించింది. కొత్తగా నియమితులైన వారిలో 43 మంది కొత్తవారు ఉన్నారు. గతంలో వివిధ పదవుల్లో ఉన్న రెండు డజన్ల మందిని తొలగించింది. ఈ నియామకాల్లో అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ‘సామాజిక న్యాయం’ ఫార్ములాకు పెద్దపీట వేశారు.
మొత్తం 81 మంది కార్యదర్శుల్లో దాదాపు 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. 29 మంది సాధారణ వర్గానికి చెందినవారు ఉన్నారు. 20 మంది ఓబీసీ వర్గం, ఐదుగురు అత్యంత వెనుకబడిన తరగతుల-ఈబీసీ, 11 మంది ఎస్సీ వర్గం, ఐదుగురు ఎస్టీ వర్గానికి చెందినవారు. 11 మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. కార్యదర్శులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల నేతలు ఉన్నారు.
Hon'ble Congress President has appointed/ reassigned the following party functionaries as AICC Secretaries, attached to their respective States, Union Territories, and functional responsibilities, as enclosed, with immediate effect. pic.twitter.com/jB2HqrGxTp
— AICC Communications (@AICCMedia) November 19, 2026