E-Paper
Advertisement

ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!
Advertisement

Jabardasth Babu: జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ బాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకున్న బాబు.. ఇటీవల ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వెబ్ సిరీస్ తీసి దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈటీవీ విన్ యాప్ కోసం రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే దర్శకుడిగా సినిమా తీసిన తరువాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాబు.. ఎట్టకేలకు తన ప్రేయసి అమూల్యతో ఏడడుగులు వేశారు. ఇటీవలే బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహించిన కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన బాబు..” మరో 10 రోజుల్లో నా పెళ్లి ఉంటుంది” అని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

ఎట్టకేలకు ప్రేయసితో ఏడడుగులు వేసిన బాబు..

ఇక అన్నట్టుగానే “ఇది జరిగిపోయింది ” అంటూ తన పెళ్లి వేడుకకు ముందు జరిగే ఫోటోషూట్ వీడియోని అభిమానులతో పంచుకుంటూ ఈ శుభవార్తను తెలిపారు. మొత్తానికైతే దర్శకుడిగా సక్సెస్ అయిన బాబు ఇప్పుడు వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో మరొక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం బాబు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వైరల్ కావడంతో అభిమానులు,సినీ సెలబ్రిటీలు, బుల్లితెర అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బాబు భార్య ఎవరంటే?

Advertisement

అమూల్య విషయానికి వస్తే ..ఈమె బి ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో యాంకర్ గా కూడా పనిచేసింది. యాంకర్ గా న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న సమయంలోనే అమూల్య పై ఇష్టం పెంచుకున్న బాబు ఆమె ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎన్నో సార్లు ఆమె వెంట పడ్డారట. అయితే ఒకసారి బాబుకి ఆమె గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా బాబు ప్రయత్నించడం.. ఆయన ప్రేమకు అమూల్య ఫిదా అవడంతో ఇప్పుడు ఎట్టకేలకు ఏడడుగులు వేశారు.

also read: నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

పెళ్లి వేడుకలో సందడి చేస్తున్న జబర్దస్త్ పెర్ఫార్మెర్స్..

Advertisement

ఇదిలా ఉండగా బాబు అమూల్యాతో ఏడడుగులు వేసిన సందర్భంగా పెళ్లి వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు .అందులో సునీత, టేస్టీ తేజ, జిత్తు , సందీప్, పంచ్ ప్రసాదు, నూకరాజు వంటి వాళ్లంతా వచ్చారు. ఫైనల్ గా మా బాబు ఒక ఇంటివాడు అయ్యాడు.. కంగ్రాట్యులేషన్స్ బాబు అంటూ తేజ తెలిపారు. పైగా టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అండ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే బాబు పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికైతే బాబు పెళ్లి చేసుకోవడంతో నేటిజన్స్ కూడా ఈయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

?gwpx=MWxoN3ZicGo4Ymx3aQ==

Related News

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

Gundeninda Gudigantalu : భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి సాగర్ వెళ్ళిపోతాడా..? వల్లికి గుడ్ న్యూస్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  

Brahmamudi Serial Today Episode November 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రప్రతాప్ జువ్వెల్లరీ కోసం పోటీ పడుతున్న ఇందు, ఐవ్వర్య  

Big Stories

Advertisement
×