E-Paper
Advertisement

స్కూటీ ముందు స్టైలిష్ ఫోజు.. బుడ్డోడి భవిష్యత్తునే మార్చేసిందోచ్.. షోరూమ్ ఓనర్ బంపర్ గిఫ్ట్!

స్కూటీ ముందు స్టైలిష్ ఫోజు.. బుడ్డోడి భవిష్యత్తునే మార్చేసిందోచ్.. షోరూమ్ ఓనర్ బంపర్ గిఫ్ట్!
Advertisement

Viral Boy: మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల బుడ్డోడు.. నెట్టింట సెన్సేషన్ గా మారాడు. తమ తల్లిదండ్రులు కొత్తగా కొన్న స్కూటీ ముందు అతడు ఇచ్చిన స్టైలిష్ ఫోజు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 13.7 కోట్ల వ్యూస్ రావడంతో షోరూమ్ యజమాని బుడ్డోడికి ఊహించని ఆఫర్ ఇచ్చాడు. తన షోరూమ్ కు ఎక్కడా లేని పబ్లిసిటీ చిన్నారి కారణంగా రావడంతో.. ఆ బుడ్డోడి చదువు బాధ్యతలు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయ్యే చదువు ఖర్చులు తానే భరిస్తానని హోండా డీలర్‌షిప్ యజమాని ప్రకటించారు.

అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలోని యావత్మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల రుద్రాంశ్ సింగ్ ఠాకూర్ నవంబర్ 9న తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి కొత్త హోండా యాక్టివా స్కూటర్ డెలివరీ తీసుకోవడానికి షోరూమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని జేబుల్లో చేతులు పెట్టి, స్కూటర్ ముందు ఎంతో స్టైలిష్ గా ఫోజులిచ్చాడు. కుటుంబ సభ్యులు సరదాగా తీసిన ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 137 మిలియన్ల వ్యూస్‌తో పాటు 68 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

షోరూమ్ ఓనర్ గొప్ప మనసు

Advertisement

ఈ వీడియో స్కూటర్ ను కొనుగోలు చేసిన షోరూమ్ యజమాని దిలీప్ బొబాడే పాటిల్ దృష్టిని కూడా ఆకర్షించింది. చిన్నారికి వచ్చిన ఆదరణను సెలబ్రేట్ చేయడానికి కుటుంబాన్ని షోరూమ్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప ప్రకటన చేశారు. రుద్రాంశ్ కేజీ-1 నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు అయ్యే విద్యా ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న యశ్ చించోల్కర్.. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదని, ఆ చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప అవకాశమని ప్రశంసించారు.

Also Read: అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

తల్లి ఆనందం.. నెటిజన్ల ప్రశంసలు

Advertisement

తమ కుమారుడికి ఇంతటి ప్రేమ లభించడంపై బాలుడి తల్లి సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చదువు బాధ్యతను తీసుకున్న షోరూమ్ యజమానికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు ఆ చిన్నారి హావభావాలు, ఆత్మవిశ్వాసానికి ముగ్ధులైన నెటిజన్లు రుద్రాంశ్‌కు ‘ఔరా కిడ్’ (Aura Kid) అని ముద్దుపేరు పెట్టారు. కొందరు అతని స్టైల్ చూసి ‘లిటిల్ డాన్’ అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు సరదాగా ‘హోండా కొత్త ఛైర్మన్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

?utm_source=ig_embed&ig_rid=AlnBzzHB6iQsAOwpcVJSieW

Also Read: మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ ప్రారంభం.. పెట్టుబడుదారులకు పండగే, ఇష్యూ ప్రైస్‌తోపాటు జీఎంపీ

Tags

Related News

కంటతడి పెట్టిస్తున్న ఘటన.. బావిలో సామూహిక ఆత్మహత్యల కలకలం, తమిళనాడులో ఘటన

డ్రగ్స్ మహమ్మారిపై ప్రధాని భావోద్వేగం.. యువత భవిష్యత్తుపై ఆవేదన.. నక్సలిజం తరహాలో అంతానికి పిలుపు!

కడుపు మండి కోర్టుకెక్కిన మహిళ.. ఆ ఒక్క పదంపై వ్యవస్థనే నిలదీత.. హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకలో చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు యువతుల మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

పట్టపగలే సినిమా స్టైల్ దోపిడీ.. రూ. 40 కోట్ల నగలతో జంప్.. వెళ్తూ వెళ్తూ ‘మళ్లీ వస్తాం’ అంటూ వార్నింగ్!

మోదీకి చుక్కలు చూపిస్తోన్న రాహుల్.. విదేశీ గడ్డపై నుంచి మరో డేంజరస్ కామెంట్!

లిఫ్టులు, ఎస్కలేటర్లపై కొత్త రూల్స్.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. రాష్ట్రంలో అందరూ పాటించాల్సిందే!

Big Stories

Advertisement
×