Kodaikanal: శీతాకాలం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అర్ధరాత్రి తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడైకెనాల్ ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సులో 100 అడుగుల లోయపడి పోయింది. స్పాట్‌లో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
శీతాకాలం వచ్చిందంటే హిల్స్ ఏరియాలకు వెళ్లడానికి పర్యాటకులు ఇష్టపడతాడు. ఏపీ, తెలంగాణ, తమిణనాడు, కేరళ వంటి ప్రాంతాలు కళకళలాడుతాయి. ఒక్కోసారి ఆయా ఏరియాల్లో ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా గురువారం అర్ధరాత్రి తర్వాత తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడై కెనాల్-పళని ఘాట్ రోడ్డులోని సవరిక్కాడ్ వద్ద ఓ మినీ బస్సు 100 అడుగుట లోయలో పడిపోయింది.
ప్రమాదం సమయంలో ఆ బస్సులోని దాదాపు 24 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం..పళనికి చెందిన 24 మంది కొడై కెనాల్‌లో జరిగే వివాహ విందుకు మినీ బస్సులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత పళనికి తిరిగి వస్తుండగా సవరిక్కాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్న వారిని తాడుల సహాయంతో వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ALSO READ: అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. అసలేం జరిగింది? ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూ?
స్పాట్‌లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లలో పళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కోయంబత్తూర్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.