PM Modi: ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల (Drugs) మహమ్మారిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మత్తుమందుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాలని మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో ఆయన గొంతు తడబడిందని, భావోద్వేగంతో మాట్లాడారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది మార్చిలో దేశంలో నక్సలిజం అంతమైందని కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. దేశానికి సవాలుగా మారిన నక్సలిజాన్నే విజయవంతంగా నిర్మూలించగలిగినప్పుడు, డ్రగ్స్ మహమ్మారిని కూడా అంతే కఠినంగా అంతం చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డ్రగ్స్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో విఫలమైందన్న విమర్శలు రాజకీయ అస్త్రంగా మారిన వేళ మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిరేపుతోంది.
Also Read: సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!
మరోవైపు దేశంలో నక్సలిజం అంతమైందన్న కేంద్ర ప్రకటన తర్వాత భద్రతా బలగాల మోహరింపులో కీలక మార్పు చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ల నుంచి 1,000 మందికి పైగా సిబ్బంది కలిగిన సీఆర్పీఎఫ్ (CRPF) బెటాలియన్‌ను కేంద్రం ఉపసంహరించింది. ఈ బలగాలను శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం మణిపూర్‌కు తరలించింది. మావోయిస్టుల ఏరివేత ముగిసిన తర్వాత కేంద్ర సాయుధ పోలీసు దళం యూనిట్‌ను ఆ ప్రాంతం నుంచి వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి.
Also Read: Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!