E-Paper
Advertisement

Congress MP Candidates 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. వారసులకు ఛాన్స్

Congress MP Candidates 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. వారసులకు ఛాన్స్
Advertisement

Congress MP Candidates Second List

Congress MP Candidates Second List: సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పటికే 39 మంది లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన హస్తం పార్టీ తాజాగా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 43 మంది లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.  దీంతో ఇప్పటి వరకు 82 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ రెండో జాబితాలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, డామన్ దీవిలో పోటీ చేేసే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
కాంగ్రెస్ వారసులకు లోక్ సభ టిక్కెట్లు ఇస్తోంది. రెండో జాబితాలో ముగ్గురు మాజీ సీఎంల తనయులకు చోటు దక్కింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తనయుడు వైభవ్ గెహ్లోట్ కు జాలోర్ లోక్ సభ సీటు ఇచ్చింది. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడికి ఎంపీ టిక్కెట్ దక్కింది. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ కు ఛింద్వాడా స్థానం నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కుమారుడు జోర్హాట్ స్థానాన్ని కేటాయించింది. గతంలో తరుణ్ గగోయ్ తనయుడు కలియాబోర్ లోక్ సభ నుంచి పోటీ చేశారు.
కాంగ్రెస్ రెండో జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. సెకండ్ లిస్టులోనిి 43 మందిలో 13 మంది ఓబీసీలున్నారు. 10 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు దక్కాయి. 9 మంది ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ముస్లింలకు ఒక సీటు కేటాయించింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 10 మంది మాత్రమే ఉన్నారు.
Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×