BigTV English

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar


Actor Sarath Kumar Merged AISMK Party in BJP: సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి.. ఏఐఎస్ఎంకేను బీజేపీలో విలీనం చేయడం ఆసక్తిగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో పార్టీని విలీనం చేశారు.

చెన్నైలో ఏఐఎస్ఎంకే కార్యకర్తలకు శరత్ కుమార్ సందేశమిచ్చారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అలాగే భారత్ ఆర్థిక వృద్ధి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. డ్రగ్స్ కల్చర్ ను అంతం చేసి యువత మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు.


తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని తన పార్టీ కార్యకర్తలకు శరత్ కుమార్ పిలుపునిచ్చారు.

Also Read: హర్యానా కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ.. కాసేపట్లో ప్రమాణస్వీకారం..

సినీ నటుడు మంచి పేరు సంపాదించిన శరత్ కుమార్ 1996లో రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత డీఎంకేలో చేరారు. 2001 రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. అయితే 2006 అసెంబ్లీ ఎన్నికల ముందు శరత్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే వీడారు. వెంటనే తన భార్య రాధికతో కలిసి అన్నాడీఎంకే గూటికి చేరారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కొద్ది కాలానికే అన్నాడీఎంకేను బయటకు వచ్చేశారు.

శరత్ కుమార్ 2007 ఆగస్టులో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్టిగా పేరు పెట్టారు. ఏ ఎన్నికల్లోనూ ఏఐఎస్ఎంకే పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు లోక్ సభ వేళ బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×