BigTV English

Consumer Forum | సీనియర్ సిటిజన్లకు భారీ జరిమానా.. రైల్వే శాఖకు కోర్టు మొట్టికాయలు!

Consumer Forum | ఢిల్లీ నుంచి బెంగుళురుకు రైలులో ప్రయాణానికి బయలుదేరిన వృద్ధ దంపతులకు రైల్వే అధికారులు(Railways) రూ.22,000 జరిమానా విధించారు. తమ తప్పు లేకపోయినా వారు ఆ జరిమాని చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఆ ఇద్దరు దంపతులు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడ న్యాయం జరుగలేదు. దీంతో వారు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు

Consumer Forum | సీనియర్ సిటిజన్లకు భారీ జరిమానా.. రైల్వే శాఖకు కోర్టు మొట్టికాయలు!

Consumer Forum | ఢిల్లీ నుంచి బెంగుళురుకు రైలులో ప్రయాణానికి బయలుదేరిన వృద్ధ దంపతులకు రైల్వే అధికారులు(Railways) రూ.22,000 జరిమానా విధించారు. తమ తప్పు లేకపోయినా వారు ఆ జరిమాని చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఆ ఇద్దరు దంపతులు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడ న్యాయం జరుగలేదు. దీంతో వారు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టుని ఆశ్రయించారు.


ఆలోక్ కుమార్ అనే యువకుడి తల్లిదండ్రుల వయసు (తండ్రి 77, తల్లి 70) రీత్యా సీనియర్ సిటిజెన్స్. తల్లిదండ్రుల కోసం ఆలోక్ కుమార్ ఢిల్లీ నుంచి బెంగుళూరుకు ట్రైన్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు. కానీ ప్రయణం చేసే రోజు ప్రయాణికులైన అతని తల్లిదండ్రులు ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కారు. కానీ కాసేపటి తరువాత వారు కూర్చున్న సీట్లు వేరే వాళ్లకు కేటాయించబడ్డాయని వారికి తెలిసింది. ట్రైన్‌లో టిటి ఆఫీసర్ వచ్చి ఆ ఇద్దరు వృద్ధులకు జరిమానా విధించాడు. వారి టికెట్లు మరొకరికి కేటాయించారని.. ఇక వారి టికెట్లు చెల్లవని చెప్పాడు. ట్రైన్‌లో ప్రయాణించాలంటే రూ.22300 జరిమానా చెల్లించాలని లేకపోతే మార్గమధ్యలో దిగిపోవాలని టిటి ఆఫీసర్ అన్నాడు.

చేసేది లేక ఆ వృద్ధ దంపతులు రూ.22,300 చెల్లించాక కూడా వారికి సరైన సీటు లభించలేదు. అతి కష్టం మీద వారు తమ ప్రయాణం పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వారి కొడుకు ఆలోక్ కుమార్ రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో అతను బెంగుళూరు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు లో ఫిర్యాదు చేశాడు.


వినియోగదారుల ఫోరం కోర్టు విచారణ ప్రారంభించినప్పుడు IRCTC BOOKING తరపున వాదించిన లాయర్.. తప్పు తమది కాదని ఎవరో సిస్టమ్ హ్యాక్ చేసి ఉంటారని చెప్పాడు. రైల్వే అధికారులు కూడా తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకపోయారు. దీంతో వినియోగదారుల ఫోరం రైల్వే శాఖపై సీరియస్ అయింది. వెంటనే వృద్ధ ప్రయాణికుల వద్ద తీసుకున్న రూ.22300 జరిమానాతో పాటు ఇప్పటి వరకు వడ్డీ కలిపి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

దీనికి తోడు రైల్వే తప్పిదం వల్ల మానసిక ఒత్తిడి అనుభవించినందుకు అదనపు రూ.30000, కోర్టు ఖర్చుల కింద మరో రూ.10000 మొత్తం రూ.65000 చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×