BigTV English

New York : ఆ ఇండియన్ ఉమెన్ ఆచూకీ కోసం.. ఎఫ్‌బీఐ అదిరిపోయే ఆఫర్..

New York : అమెరికాలోని న్యూజెర్సీలో భారతదేశానికి చెందిన విద్యార్థి నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైంది. అప్పటి నుండి ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆచుకీ తెలిపిన వారికి 10,000 డాలర్లు అంటే భారత్ కరెన్సీ ప్రకారం రూ 8.32 లక్షలు కోట్లు రూపాయలను రివార్డ్ గా ప్రకటించింది.

New York : ఆ ఇండియన్ ఉమెన్ ఆచూకీ కోసం.. ఎఫ్‌బీఐ అదిరిపోయే ఆఫర్..

New York : అమెరికాలోని న్యూజెర్సీలో భారతదేశానికి చెందిన విద్యార్థి నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆచుకీ తెలిపిన వారికి 10,000 డాలర్లు అంటే భారత్ కరెన్సీ ప్రకారం రూ 8.32 లక్షల రూపాయలను రివార్డ్ గా ప్రకటించింది.


వివరాల్లోకి వెళ్తే 29 ఏళ్ల మయూషీ భగత్ .. 2019న మే 1 వతేదిన న్యూ జెర్సీ సీటీలోని తన నివాసం నుంచి బయటికి వెళ్ళింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు స్నేహితులను సంప్రదించినా ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి మిస్సింగ్ పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. నాలుగు ఏళ్ళ నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే మయూషీ ఆచుకీ ఇంకా తెలియకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. యువతి అచూకీ సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు రివార్డ్ ప్రకటించింది.


ఇంతకి ఏవరు మయూషీ భగత్
మయూషీ భగత్ 1994న గుజరాత్ రాష్ట్రంలో వడోదరా ప్రాంతంలో జన్మించింది. 2016 లో ఎఫ్1 వీసాపై ఉన్నత చదువులు కోసం అమెరికాలో న్యూయార్క్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతుంది. మయూషీ భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. చివరిసారిగా గోదుమ రంగు కళ్ళు , నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ గత ఏడాది జూలై లో తన వెబ్‌సైట్ లోని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తప్పిపోయిన వ్యక్తిగా లేదా కిడ్నాప్ గురి అయిన వ్యక్తి గా పేర్కొంది. మయూషీ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీసులో గానీ లేదా జెర్సీ ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపింది.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×