E-Paper
Advertisement

Crime News: ఆలయంలోకి ఉగ్రవాదులు.. ఎదురుదాడి చేసిన భక్తుడు.. వీడియో వైరల్..

Crime News: ఆలయంలోకి ఉగ్రవాదులు.. ఎదురుదాడి చేసిన భక్తుడు.. వీడియో వైరల్..
Advertisement
crime news

Terrorists: ముంబై ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. అప్పటినుంచి టెర్రరిస్ట్ అంటేనే జనాలు హడలిపోతున్నారు. స్పెషల్ ఫోర్సెస్‌ను మరింత పటిష్టం చేసి నిత్యం అలర్ట్‌గా ఉంచుతున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని ఓ ఆలయంలో అనూహ్య ఘటన జరిగింది. కాసేపు తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే…

మహారాష్ట్ర ధూలేలోని శ్రీ స్వామి నారాయణ ఆలయం. భక్తులతో కోలాహలంగా ఉంది. అంతలోనే ముఖానికి ముసుగు ధరించిన కొందరు తుపాకులతో ఆలయంలోకి దూసుకొచ్చారు. ఓ భక్తుడి తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించారు.

Advertisement

ఊహించని పరిణామానికి ఆలయంలోని భక్తులు షాక్‌కు గురయ్యారు. పిల్లలు బోరున ఏడ్వడం మొదలుపెట్టారు. తన చిన్నారి బెదిరిపోయి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఓ తండ్రికి తెగ కోపం వచ్చేసింది. ఇదేం పనంటూ.. తుపాకీతో ఉన్న దుండగుడిపైకి దూసుకెళ్లాడు. ఆవేశంతో చెంప పగలగొట్టాడు. అసలే ఉగ్రవాది.. ఆయన్నే కొడితే ఊరుకుంటాడా?

ఈలోగా టెంపుల్‌లో టెర్రరిస్టులు జొరపడ్డారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ వచ్చింది. పోలీసులు వెంటనే హైఅలర్ట్ అయ్యారు. ఆ ఆలయంలోకి ప్రవేశించి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ముసుగు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ పట్టుకున్న ఉగ్రవాదిని చూసి అదరకుండా బెదరకుండా దాడి చేసిన భక్తుడిని అంతా ప్రశంసిస్తున్నారు.

Advertisement

కట్ చేస్తే.. ఇదంతా మాక్ డ్రిల్ అని చివరాఖరికి చల్లగా ప్రకటించారు పోలీసులు. ముఖానికి ముసుగు వేసుకొచ్చింది ఉగ్రవాదులు కాదని.. పోలీసులేనని చెప్పారు. ఆ భక్తుడి ధైర్యాన్ని ప్రశంసించారు. మాక్ డ్రిల్ ఏమో కానీ.. భయంతో చచ్చినంత పని అయిందంటూ స్థానికులు ఖాకీలపై మండిపడుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×