E-Paper
Advertisement

Murder Case: హైదరాబాద్‌లో కాల్పులు.. నడిరోడ్డుపై రియల్టర్‌ హత్య

Murder Case: హైదరాబాద్‌లో కాల్పులు.. నడిరోడ్డుపై  రియల్టర్‌ హత్య
Advertisement

Murder Case: హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై, జనాలు చూస్తుండగానే.. రియల్టర్‌గా పనిచేస్తున్న రత్నం అనే వ్యక్తిపై దుండగులు అతి కిరాతకంగా చంపేశారు.

మల్కాజిగిరి జవహార్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘోర హత్య చోటుచేసుకుంది. సాకేత్ కాలనీలో ఫోస్టర్ స్కూల్ సమీపంలో బైక్ మీద వెళ్తున్న రియల్టర్ రత్నంను దుండగులు కత్తులతో వెంబడించారు. కత్తులతో అనేక సార్లు నరికి తుపాకీతో కాల్చి చంపి, అక్కడి నుండి దుండగులు పారిపోయారు.

Advertisement

దాడి జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రమైన గాయాలతో ఉన్న రత్నాన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ హత్య పక్కాగా ప్లాన్ చేసి చేసిందని, దుండగుల కదలికలన్నీ ముందే రికార్డ్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా కొన్ని స్పష్టమైన సన్నివేశాలు ఉన్నట్లు పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవి పుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

దాడికి ముందు వారు ఏ వాహనాల్లో వచ్చారు? ఎక్కడ దాగి ఉన్నారు? దాడి అనంతరం ఏ దిశగా పారిపోయారు? వంటి వివరాలను విశ్లేషిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న రత్నం కొన్ని రోజులుగా స్థానిక వివాదాల్లో కూడా మధ్యవర్తిత్వం చేసినట్లు సమాచారం. అతడికి కొందరి వ్యక్తులతో గతంలో విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×