BigTV English
Advertisement

Dibrugarh Express Train Accident: యూపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. నలుగురు మృతి

Dibrugarh Express Train Accident: యూపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. నలుగురు మృతి

Dibrugarh Express Train Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పింది. గోండాజిల్లాలో చండీగఢ్, డిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకోగా ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ  ప్రమాదంలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది.


చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌కు ట్రైన్ బయలు దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝలాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల దూరంలో రైలు ప్రమాదానికి గురైంది. నాలుగు ఏసీ బోగీలు సహా 10 బోగీలకు పైగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సమాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే సీఎం యోగీ ఆథిత్య నాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.


బుధవారం రాత్రి 15904 నంబర్ రైలు చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. కాసేపట్లో స్టేషన్‌కు రైలు చేరుకోవాల్సి ఉండగా రైలు పట్టాలు తప్పింది. బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

15 అంబులెన్స్‌లు మెడికల్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లగేజీతో కొందరు, గాయాలపాలైన ప్రయాణికులు కొందరు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అధికారులు సహాయకచర్యల చేపట్టారు. సీఎం హిమంతా బిస్వా శర్మ ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. రైలు ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైలు పోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు.

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×