Earthquake : నేపాల్‌ను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే 3 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి దాటక 1.57 గంటల సమయంలో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప తీవ్రతకు నేపాల్‌లోని దోతి జిల్లాలో ఇల్లు కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోనూ భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిలీ సరిహద్దుల్లోని నోయిడా, గుర్ గామ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. మణిపూర్ , ఉత్తరాఖండ్ లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఢిల్లీలో ప్రజలు చలిలోనే రాత్రంతా రోడ్లపై జాగారం చేశారు.