BigTV English
Advertisement

England : ఇంగ్లండ్‌లో ఇండియన్స్ హవా.. ఆ దేశ ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే

England : ఇంగ్లండ్‌లో ఇండియన్స్ హవా.. ఆ దేశ ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే

England : ఇంగ్లండ్ లో అన్ని రంగాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా భారతీయ ములాలున్న రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో అనేక మంది రాణిస్తున్నారు. అనేక మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.
ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశీయులే అని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5 శాతం మంది భారతీయులేనని తెలిపింది. పాశ్చాత్య దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా పెరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంగ్లండ్‌లోనూ భారతీయుల జనాభా పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది.


బ్రిటన్‌ జాతీయ గణాంక కార్యాలయ నివేదిక-2021 ప్రకారం ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న వారిలో విదేశీయుల సంఖ్య 2011లో 75 లక్షలుగా ఉంది. 2021 నాటికి విదేశీయుల సంఖ్య కోటికి చేరుకుంది. అంటే గత పదేళ్లలో బ్రిటన్ లో ప్రవాసుల సంఖ్య 25 లక్షలు పెరిగింది. బ్రిటన్ లో 2011లో భారతీయుల సంఖ్య 6 లక్షల 94 వేలుగా ఉంది. తాజాగా నివేదిక ప్రకారం అక్కడ 9 లక్షల 20 వేల మంది భారతీయులున్నారు. తర్వాతి స్థానంలో పోలండ్‌ దేశీయులు 7 లక్షల 43 వేల మంది ఉన్నారు.

లండన్‌లో నివసించే వారిలో ప్రతి 10 మందిలో నలుగురు విదేశీయులే ఉన్నారు.గత పదేళ్లలో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5 లక్షల 39 వేలకు చేరింది. రొమేనియా నుంచి పనికోసం వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేశారు. తర్వాత వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ కు వలసలు పెరిగాయి. అమెరికా, జమైకా నుంచి వలసలు తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×