BigTV English

Hemant Soren: హేమంత్ సోరెన్‌కు బెయిల్.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ

Hemant Soren: హేమంత్ సోరెన్‌కు బెయిల్.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ

Hemant Soren ED news today(Today’s news in telugu): భూ కుంభకోణం కేసులో ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమంటూ పేర్కొంది. సోరెన్‌పై ప్రాథమికంగా ఎలాంటి కేసులేదని హైకోర్టు చెప్పడాన్ని తప్పుబట్టింది ఈడీ.


భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు హేమంత్ సోరెన్‌కు గత నెల 28న బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు సోరెన్ రాంచీలోని బిర్సా ముండా జైలు నుంచి బయటకు వచ్చారు.

హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్ రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం ఝార్కండ్ అసెంబ్లీలో సోరెన్ బలపరీక్ష నెగ్గారు.


అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత హేమంత్ సోరెన్‌ను జనవరి 31న రాంచీ రాజ్‌భవన్‌లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణానికి సంబంధించి సోరెన్, ఐఏఎస్ అధికారి, రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, భాను ప్రతాప్ ప్రసాద్ సహా 25 మందిని ఈడీ అరెస్టు చేసింది.

Also Read: బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..

హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో చంపై సోరెన్ ఝార్కండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×