BigTV English
Advertisement

Encounter In Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కీలక టెర్రరిస్టులు హతం..?

Encounter In Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కీలక టెర్రరిస్టులు హతం..?

Encounter In Kashmir: జమ్మూకశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తుండగా, ఒక్కసారిగా కాల్పులు జరిపింది ముష్కరమూక. వెంటనే అలర్టయిన జవాన్లు.. ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయ్‌. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.


ఉగ్రవాదులను గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించిన ఇండియన్ ఆర్మీ

పహల్గాం దాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ..ఎక్కడికక్కడే ఏరిపారేస్తోంది. ఇప్పటికే మే 13వ తేదీన ముగ్గురు ముష్కరులను అంతమొందించిన భారత బలగాలు..తాజాగా పుల్వామా సింగ్‌పోరా ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టుల అంతు చూసింది. అంత్యంత చాకచక్యంగా డ్రోన్‌ సాయంతో ఉగ్రవాదులను గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించింది.


ఉగ్రవాదుల జాడను కనిపెట్టిన భారత ఆర్మీ

సింగ్‌పోరా ప్రాంతంలోని భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా సిబ్బందిని చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ సమయంలో మన సైనికుల దాడిని ఎదుర్కోలేక.. ఉగ్రవాదులు.. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కున్నారు. ఈ సమయంలో .. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారత ఆర్మీ డ్రోన్‌ను రంగంలోకి దించింది. ఓ ట్యాబ్‌కు డ్రోన్‌ను కనెక్ట్ చేసి.. ఉగ్రవాదుల జాడను కనిపెట్టింది భారత ఆర్మీ. ఉగ్రవాదులు రైఫిల్స్‌ను సరిచేసుకుంటుండగా.. ఆ దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. మరోచోట ఓ షెడ్‌లో గుమిగూడిఉన్న కొందరు ఉగ్రవాదుల దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ.. అత్యంత చాకచక్యంగా వ్యహరించింది. టెర్రరిస్టులకు తెలియకుండానే.. వారికి గన్స్‌ ఎయిమ్ చేసి.. మట్టుబెట్టింది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లను ఉపయోగించి.. ఉగ్రవాదులను అంతం చేసింది.

థ్రాల్‌ గ్రామానికి చెందిన 2022లో ఒకసారి అరెస్ట్

ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజీర్‌ వానీ, యవర్‌ అహ్మద్‌ భట్‌ హతయ్యారు. ఇందులో ఆసిఫ్ అహ్మద్ షేక్..పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. థ్రాల్‌ గ్రామానికి చెందిన 2022లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ విషయాన్ని ఇంతవరకూ అధికారులు ధ్రువీకరించలేదు.

ఎన్‌కౌంటర్‌ సమయంలో తల్లితో వీడియో కాల్‌

అయితే ఈ కాల్పుల్లో అంతమైన ఉగ్రవాది అమీర్ నజీర్ వాని.. ఎన్‌కౌంటర్‌ సమయంలో తల్లితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆ టెర్రరిస్టును లొంగిపోవాలని ఆమె కోరింది. ఈ సమయంలో ఉగ్రవాది అమీర్ నజీర్ వాని దగ్గర AK 47 గన్ కనిపించింది. అయితే తల్లి లొంగిపోవాలని కోరినా.. ఉగ్రవాది పెడచెవిన పెట్టాడు. సైన్యం ముందుకు రానివ్వు.. అప్పుడు చూస్తాను అంటూ ముష్కరుడు బీరాలు పలికాడు. చివరకు భారత ఆర్మీ చేతిలో అంతమయ్యాడు.

ఏకే 47 రైఫిల్స్‌, మ్యాగజైన్స్‌, గ్రెనేడ్స్‌ ఉన్నాయి

ఇప్పటికే మే 13వ తేదీన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్‌, మ్యాగజైన్స్‌, గ్రెనేడ్స్‌ ఉన్నాయి.

మిగిలిన 8 మంది ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు

మరోవైపు పహల్గామ్‌ ఉగ్రవాద దాడి తర్వాత నిఘా సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. జమ్మూలో 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశాయి. వీరంతా యాక్టీవ్‌గా ఉన్నట్లు నివేదించాయి. 14 మందిలో ఆరుగురిని మట్టుబెట్టడంతో.. మిగిలిన 8 మంది ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×