Mana Ooru-Mata Manthi: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. తొలుత ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాతో మొదలైంది. టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
గురువారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ‘మన ఊరు-మాటా మంతి’ కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడారు. టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రావివలస గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం పవన్. అభిమానుల తాకిడి, భద్రత కారణాల వల్ల ప్రజలతో నేరుగా కలవలేకపోతున్నారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం రావివలస గ్రామానికి చెందిన 290 మందిని హాజరయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది.
ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. వచ్చేవారం కీలకం, అంతా రెడీ
ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు – మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిర్వహించారు.#ManaOoruMataManthi#PawanKalyanAneNenu pic.twitter.com/NZjvAMOelO
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 22, 2025