Kamal Haasan : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. సినిమాలు ఆడకపోవడంతో… నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబ్యూటర్లకు ఇన్ కమ్ సోర్సు తగ్గిపోయింది. దీంతో థియేటర్స్ నుంచి వచ్చే డబ్బులపై షేరింగ్ పద్దతి, రెంటల్ పద్దతి అంటూ వివాదాలు జరుగుతున్నాయి.
దీని అంతటి కారణం… ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడకపోవడమే. ఆడియన్స్ థియేటర్స్ గడప తొక్కకపోవడమే. అని చెప్పొచ్చు. మరి ఆడియన్స్ థియేటర్స్ కు రావడం ఎందుకు తగ్గించారు అంటే… ఎలాంటి సంశయం లేకుండా… ఓటీటీలో అని ఆన్సర్ వస్తుంది.
సినిమాలు థియేటర్స్‌కి వచ్చిన తర్వాత వెంటనే ఓటీటీలకు వస్తున్నాయి. కనీసం 4 వారాలు అయిన గ్యాప్ ఇవ్వాలని ఓ రూల్ పెట్టుకున్నారు. కానీ, ఆ రూల్ పేపర్స్‌కే పరిమితం అయ్యాయే తప్పా… ఎవరూ పాటించడం లేదు. 4 వారాల కంటే ముందే… సినిమాను ఓటీటీలో వచ్చేలా నిర్మాతలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీని వల్లే థియేటర్స్ లో సినిమాలు ఆడటం లేదు.
ఓటీటీలపై కమల్ హాసన్ నిర్ణయం…
ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. అందుకే తన రాబోయే సినిమా థగ్ లైఫ్ ఓటీటీ విషయంలో ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
థియేటర్స్ లోకి వచ్చిన సినిమా వెంటనే ఓటీటీలోకి వస్తే సినిమా పరిశ్రమ బాగుపడదని అన్నారు. ఇండస్ట్రీ బాగుండాలి అంటే… ఓటీటీలోకి సినిమా వీలైనంత ఆలస్యంగా రావాలని, అప్పుడు ఆడియన్స్ తియేటర్స్ కి వస్తారు అని కామెంట్ చేశాడు.
మాటలు చెప్పడమే కాదు.. తన థగ్ లైఫ్ సినిమాను ఓటీటీలో 8 వారాల తర్వాత రిలీజ్ చేయాలని నెట్ ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అంతే కాదు.. వీలైతే… దాన్ని పొడగించాలని కూడా ఆ ఒప్పందంలో రాసుకున్నాడు. దీనికి నెట్ ఫ్లిక్స్ కూడా అంగీకరించిందట.
అంటే థగ్ లైఫ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత 2 నెలలకు ఓటీటీలో చూడటానికి వీలు ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా… థియేటర్స్ లోనే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.
మన నిర్మాతలు పాటిస్తారా..?
కమల్ హాసన్ తీసుకున్నది ఒక నిర్ణయం మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆయన ఓ దారి చూపించాడు. మరి మన తెలుగు నిర్మాతలు దీన్ని పాటిస్తారా..? అంటే.. చెప్పలేం. ఎందుకంటే.. ఈ మధ్య తెలుగులో సినిమాలు అసలేం ఆడటం లేదు. దీంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. కనీసం ఓటీటీలకు ఎర్లీగా ఇస్తే… ఓటీటీ రైట్స్ నుంచి వచ్చే డబ్బులతో అయినా… ఆ నష్టాల నుంచి కాస్త అయినా… ఉపశమనం ఉంటుందని వారి ఆలోచన.