Big Stories

Special Trains: సొంతూళ్లకు వెళ్లేవారికి శుభవార్త.. 4 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు..!

- Advertisement -

Special Train Services Extended: పండుగలు, వేసవి సెలవులు కలిసొచ్చాయి. ఏప్రిల్ 6 నుంచి 11 వరకూ ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చాయి. వారాంతం తర్వాత ఉగాది, రంజాన్ సెలవులు కలసిరావడంతో.. ఉద్యోగులు, వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా వరుస సెలవులు వచ్చినపుడు సొంతూరికి వెళ్లడం పెద్ద టాస్క్. రైళ్లు, బస్సులు ఫుల్ అయి ఉంటాయి. తత్కాల్ లో టికెట్ దొరకడం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నాలుగు స్పెషల్ ట్రైన్ సర్వీసులను జూన్ చివరి వారం వరకూ పొడిగించింది.

- Advertisement -

Also Read: 5 న్యాయాలు, 25 హామీలు.. కాంగ్రెస్ ఘర్ ఘర్ గ్యారంటీ ప్రచారం షురూ..

ప్రతీ సోమవారం కాచిగూడ నుంచి మధురైకు వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ (07191)ను జూన్ 24 వరకూ పొడిగించింది. అలాగే ప్రతి బుధవారం బయల్దేరే మదురై-కాచిగూడ (07192) ఎక్స్ ప్రెస్ ను జూన్ 26 వరకు, ప్రతి శుక్రవారం కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ కు వెళ్లే 07435 ఎక్స్ ప్రెస్ ను జూన్ 28 వరకు పొడిగించారు. అలాగే ఆదివారం బయల్దేరే నాగర్ కోయిల్ – కాచిగూడ 07436 ఎక్స్ ప్రెస్ ను జూన్ 30 వరకూ పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పొడిగించిన రైళ్ల సర్వీసుల్లో హెచ్ఎస్ నాందేడ్ – ఈ రోడ్ – హెచ్ఎస్ నాందేడ్, జల్నా- ఛాప్రా – జల్నా రైళ్ల సర్వీసులు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News