Big Stories

Congress Ghar Ghar Guarantee : 5 న్యాయాలు, 25 హామీలు.. కాంగ్రెస్ ఘర్ ఘర్ గ్యారంటీ ప్రచారం షురూ..

Congress Ghar Ghar Guarantee
Congress Ghar Ghar Guarantee

Congress Ghar Ghar Guarantee: కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఘర్‌ ఘర్‌ గ్యారంటీ కార్యక్రమాన్ని షురూ చేసింది. 5 న్యాయాలు, 25 హామీలను ప్రకటించింది. ఈ హామీలను దేశంలోని ప్రతీ గడపకు చేర్చాలన్నదే లక్ష్యంగా పేర్కొంది.

- Advertisement -

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌, కైత్వాడలో ఘర్ ఘర్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్యారంటీ కార్డులను పంచుతున్నామని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు ఈ కార్డులను అన్ని వర్గాలకు వద్దకు చేర్చాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తాము ఏదైనా హామీ ఇస్తే తప్పక నెరవేరుస్తామన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరవని విమర్శించారు.

Also Read: రాహుల్‌‌‌‌పై పెద్దామె పోటీ, ఇంతకీ ఎవరామె?

ఏటా 2 కోట్ల ఉద్యోగాల ఇస్తామని మోదీ గతంలో ఇచ్చిన హామీని మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. ఐటీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరించాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఐటీ శాఖ కాంగ్రెస్ కు చెందిన రూ.135 కోట్లను స్వాధీనం చేసుకొందని మండిప్డడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇలాగే నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

ప్రజలు దేశంతోపాటు రాజ్యాంగాన్ని కాపాడాలనుకొంటున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ తన ప్రచారంలో 5 న్యాయాలు, 25 గ్యారంటీలనే చెబుతుందన్నారు. యువ న్యాయ్‌, నారీ న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, శ్రామిక్‌ న్యాయ్‌, హిస్సేదారి న్యాయ్‌ హామీలను ఇస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్‌ 5న జైపూర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభలో విడుదల చేస్తామని ప్రకటించారు.ఇప్పటికే కాంగ్రెస్ హాత్‌ బదలేగా హాలత్‌ పేరుతో నినాదాన్ని అందుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News