E-Paper
Advertisement

Jharkhand: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులతో సహా ఐదుగురు మృతి

Jharkhand: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులతో సహా ఐదుగురు మృతి
Advertisement

Jharkhand: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పురానా బజార్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మొదటి అంతస్థులోని స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగి క్రమంగా అన్ని అంతస్థులకు వ్యాపించాయి. ఈప్రమాదంలో డాక్టర్ దంపతులతో పాటు ఐదుగురు దుర్మరణం చెందారు.

రాత్రి రెండు గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. అయితే రాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉండడంతో ప్రమదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. ఈప్రమాదంలో మొదటి అంతస్థులో నిద్రిస్తున్న డాక్టర్ దంపతులు ప్రేమా హజ్రా, వికాస్ హజ్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు.

Advertisement

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×