E-Paper
Advertisement

Italy : ఇటలీ రాజధాని రోమ్ లో కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ మృతి..

Italy : ఇటలీ రాజధాని రోమ్ లో కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ మృతి..
Advertisement

Italy : ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రోమ్‌లోని ఫిడెన్‌ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్‌ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఓ దుండగుడు తుపాకీతో అక్కడికి చేరుకుని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇటవీ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

ఈ కాల్పుల్లో చనిపోయిన ముగ్గురూ మహిళలే. కాల్పుల తర్వాత స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 50 ఏళ్ల నికొలెట్టా గొలిసానో తన స్నేహితురాలేనని ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ఆమెతో గతంలో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలి మహిళా ప్రధాని. మెలోని అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

పాశ్చాత్య దేశాల్లో రోజురోజుకు గన్ కల్చర్ మితిమీరుతోంది. అమెరికాలో గతంలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు ఇటలీలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×