BigTV English

Drink It In Winter : చలికాలంలో ఇది తాగితే వైరస్‌లు దరిచేరవు

Drink It In Winter : చలికాలంలో ఇది తాగితే వైరస్‌లు దరిచేరవు

Drink It In Winter : చలి కాలం వచ్చిందంటే చాలు ఎన్నో వైరస్‌లు మనపై దాడి చేస్తాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పిలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం కారణంగా వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలి కాలంలో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడానికి అతిమధురం అనే మూలిక ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.


చలికాలంలో అతిమధురం పొడి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, లివర్‌ సమస్యలు, చర్మ ఇన్ఫెక్షన్స్‌, అధిక బరువు నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి ఉన్నవారు అతిమధురం టీని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు కప్పు నీటిలో అతిమధురం వేరు చిన్న ముక్క, చిన్న అల్లం ముక్క వేసి సన్నమంట మీద మరిగించాలి. ఆ తర్వాత వడకట్టుకుని తాగాలి. ఇంకా సులభంగా చేసుకోవాలంటే గ్లాస్‌ గోరువెచ్చని నీళ్లలో ఒక టీస్పూన్‌ అతిమధురం పొడిని కలుపుకొని తాగవచ్చు. అతిమధురం వేరును నమిలితే ఎంత మొండి జలుబు, దగ్గు నుంచి అయినా తక్షణం ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా అతిమధురం డికాక్షన్‌ తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్, కొలెస్ట్రాల్ దూరం అవుతాయి. గ్లాసు నీటిలో పావు టీస్పూన్ అతిమధురం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు నల్ల మిరియాల పొడి, తులసి ఆకులు వేసి సగం అయ్యేవరకు మరిగించాలి.. ఆ తర్వాత వడపోసి తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే మంచిది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×