E-Paper
Advertisement

Encounter: ఐదుగురు టెర్రరిస్టులు హతం.. కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

Encounter: ఐదుగురు టెర్రరిస్టులు హతం.. కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
Advertisement
encounter

Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. LOC సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. కూంబింగ్ సందర్బంగా ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అంతకుముందు జూన్​ 13న కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్​ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కశ్మీర్‌ లోయలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, తమ ఉనికి చాటుకునేందుకు.. ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. కశ్మీర్‌ లోయలో ఆయుధాలు, డ్రగ్స్‌, సమాచారాన్ని చేరవేసేందుకు ISI, ఉగ్రవాదులు మహిళలు, పిల్లలను ఉపయోగిస్తున్నట్లు సైనికాధికారులు గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తిష్ఠవేసిన మూకలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×