BigTV English

MRF Share Price : ఒక్క షేర్ వాల్యూ రూ.1 లక్ష.. అందరినీ ఆశ్చర్యపరిచిన ఎమ్ఆర్ఎఫ్..

MRF Share Price : ఒక్క షేర్ వాల్యూ రూ.1 లక్ష.. అందరినీ ఆశ్చర్యపరిచిన ఎమ్ఆర్ఎఫ్..

MRF Share Price :షేర్ మార్కెట్‌పై అవగాహన ఉండేవారికి ఎప్పుడు ఏ స్టార్ ధర పెరుగుతుంది అనే విషయంపై చాలా అవగాహన ఉంటుంది. షేర్ మార్కెట్ అనేది అందరికీ అర్థమయ్యే విషయం కాదని, అది అర్థం కాని ఒక్క చిక్కుముడిలాగా ఉంటుందని అందులో అనుభవం ఉన్నవారు అంటుంటారు. కానీ అనుభవం ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయే విషయాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి తాజాగా ఎమ్ఆర్ఎఫ్ ఒక్క షేర్ ధర రూ.1 లక్షకు చేరుకోవడమే.


చెన్నైలో ముందుగా తన స్థావరాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైర్ల కంపెనీ ఎమ్ఆర్ఎఫ్. తాజాగా ఈ కంపెనీ స్టార్ ధర రూ.1 లక్షకు చేరుకోవడానికి చాలామందిని షాక్‌కు గురిచేసింది. మంగళవారం మొదట్లో రూ.1,00,300తో మొదలైన షేర్ ధర.. రోజు ముగిసేలోపు రూ.99,988 దగ్గర ఆగింది. టీమిండియాలోని చాలామంది క్రికెటర్లు.. దాదాపు దశాబ్దం పాటు ఎమ్ఆర్ఎఫ్‌ను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ తన బ్యాట్ మీద దీని స్టిక్కర్‌ను పెట్టుకొని మరీ ప్రమోట్ చేశారు. అయితే సచిన్ రిటైర్ అయ్యే టైమ్‌కు ఎమ్ఆర్ఎఫ్ షేర్ వాల్యూ రూ.14,300.

ఒక్కసారిగా తోటి కంపెనీ షేర్ అంతగా పెరగడంతో.. ఇతర కంపెనీలతో పాటు నిపుణులు కూడా ఇలా ఎలా జరిగింది అనే విషయంపై విశ్లేషించడం మొదలుపెట్టారు. మామూలుగా షేర్ వాల్యూ పెరిగితే ప్రొడక్ట్ వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పడానికి ఎలాంటి సూచన లేదని నిపుణులు అంటున్నారు. ఆదాయం దగ్గర నుండి పెట్టుబడి, లాభాలు ఇవన్నీ చూసుకుంటేనే ప్రొడక్ట్ వాల్యూ అనేది తెలుస్తుందని తెలిపారు. షేర్ వాల్యూ పెరిగినా కూడా ఇతర కంపెనీలతో పోలిస్తే ఎమ్ఆర్ఎఫ్ మార్కెట్ వాల్యూ ఇంకా తక్కువగానే ఉందని బయటపెట్టారు.


మామూలుగా షేర్స్‌ను అమ్ముకునే ఇతర కంపెనీలు అప్పుడప్పుడు ఈ షేర్లను విభజిస్తూ ఉంటాయి. లేదా షేర్ కొంటే బోనస్ ఉంటుంది అని ఆఫర్లు పెడతాయి. కానీ ఎమ్ఆర్ఎఫ్ మాత్రం గత 50 ఏళ్ల నుండి అలాంటిది ఏమీ చేయలేదు. ఒక్కసారిగా ఎమ్ఆర్ఎఫ్ షేర్ వాల్యూ రూ.1 లక్షకు చేరడానికి ఇది కూడా ఒక కారణం అయ్యిండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా షేర్ వాల్యూ పెరిగిన దళాల్ స్ట్రీట్ రికార్డ్‌ను ఎమ్ఆర్ఎఫ్ దాటేసింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×