BigTV English

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్.. విడుదల..

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్.. విడుదల..

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలపై ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి జువాన్‌ మెర్చన్‌ ఎదుటకు న్యాయవాదులతో కలిసి ట్రంప్ వచ్చారు. ట్రంప్ పై నమోదైన నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. మొత్తం 34 అభియోగాలు మోపారు. తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్‌ విన్నవించారు.


అంతకుముందు ట్రంప్‌ కార్ల ర్యాలీతో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేసి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ఫింగర్‌ ప్రింట్‌, ఫొటోలను తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు హాలుకు తరలించారు. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్‌ విషయంలో మినహాయింపులు ఇచ్చారని తెలుస్తోంది. విచారణ అనంతరం ట్రంప్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు.

ట్రంప్‌ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతినివ్వాలని కొన్ని అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించాయి. అయితే న్యాయస్థానం ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ ప్రారంభం కావడానికి ముందు కోర్టు గది, ట్రంప్‌ ఫొటోలను తీసుకునేందుకు ఐదుగురు స్టిల్‌ ఫొటోగ్రాఫర్లకు అనుమతినిచ్చింది.


మరోవైపు న్యూయార్క్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. మన్‌హటన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ విచారణకు వచ్చిన సమయంలో రిపబ్లికన్లు భారీగా కోర్టు సమీపంలోని పార్కు వద్దకు చేరుకున్నారు. రిపబ్లికన్‌ సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు కొందరు ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ర్యాలీలు నిర్వహించారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×