E-Paper
Advertisement

Venkaiah Naidu Political Retirement: ‘నేను రాజకీయాల్లో లేను’.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Venkaiah Naidu Political Retirement: ‘నేను రాజకీయాల్లో లేను’.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Former Vice President Venkaiah Naidu: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో లేను.. వచ్చే అవకాశమూ లేదంటూ ప్రకటించారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా.. ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడారు.

దేశానికి వెన్నెముక అయిన రైతులకు, మహా శక్తి అయిన మహిళలకు, దేశ భవిష్యత్ అయిన యువతకు తన పద్మ విభూషణ్ అవార్డ్‌ను అంకితమిస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నీతి నిజాయితీ, సమయపాలన ఉన్నత స్థాయికి చేరుస్తాయన్నారు. తానకు నమ్మిన సిద్ధాంతం, పార్టీ తోడ్పాటు నిలబడిందన్నారు.

Advertisement

తనకు ఈ అవార్డు‌లు అంటే నచ్చదని వెంకయ్యనాయుడు అన్నారు. చాలా విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌లు ఇస్తామంటే వద్దన్నానన్నారు. కానీ.. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన ఈ పద్మ అవార్డు‌ను రాజకీయాలకు అతీతంగా ప్రకటించారన్నారు. అందుకే ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్టుగా పేర్కొన్నారు.

Read More: బలపరీక్ష లో నితీశ్ కుమార్ గెలుపు.. ఐదుగురు విపక్ష సభ్యులు మద్దతు..

Advertisement

ఐదుగురు ఆణిముత్యాలు అయిన భారత మహనీయులకు భారతరత్న అవార్డులు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగువాడైన పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నాన్నారు. మనమంతా భారతీయ సంస్కృతిని మర్చిపోవద్దన్నారు. సాటి మానవుడికి సహకరించాలన్నారు. పిల్లలతో సమయం గడపాలన్నారు. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని తెలిపారు.

తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతితో అందరం కలిసి జీవించాలని సూచించారు. ఇప్పటి పిల్లలు ఏది కావాలన్నా గూగుల్‌ను సంప్రదిస్తున్నారన్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ యువతకు సరైన నాయకత్వం అందించాలన్నారు. మనందరం కలిసి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×