Big Stories

Yatra 2 4 Days Collections: 4 డేస్ ‘యాత్ర 2’ కలెక్షన్స్.. ఎంత వసూళు చేసిందంటే..?

Yatra 2 4 Days world wide Collections: ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా దర్శకుడు మహి వి రాఘవ్ తాజాగా ‘యాత్ర 2’ పేరుతో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

- Advertisement -

ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు, అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాన స్వీకారం చేసేంత వరకు జరిగిన ఘటనలు, సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.

- Advertisement -

ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు. అలాగే ఆయన కుమారుడు వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా యాక్ట్ చేశాడు.

2009లో వైఎస్‌ఆర్ (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి వైఎస్‌‌ఆర్ మరణిస్తారు. దీంతో హై కమాండ్ నుంచి పాదయాత్ర చేయకూడదని ఆదేశాలు వస్తాయి. కానీ జగన్ ఆ ఆదేశాలను కాదని.. పాదయాత్ర చేసి పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు.. ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసిన పాదయాత్ర ఎలా ఉపయోగపడిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.

READ MORE: Yatra 2 Movie Review: యాత్ర2 మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాగా చూస్తే ఎలా ఉందంటే..?

అయితే పూర్తిగా వన్‌సైడ్ యాంగిల్‌లో అంటే జగన్మోహన్ రెడ్డి యంగిల్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ డే మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే మరి ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ తర్వాత పూర్తిగా చల్లబడిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.2.80 కోట్ల షేర్ (రూ. 5.70 కోట్ల గ్రాస్) వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఇక వీకెండ్‌ దాదాపు ఈ సినిమా రన్ ముగిసినట్లే తెలుస్తోంది. టాక్ బాగున్నా.. సినిమా పూర్తిగా వన్‌సైడ్ కావడంతో కేవలం జగన్ అభిమానులు మాత్రమే ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. ఇక రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్‌గా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రంలో నటించినందుకుగానూ నటీ నటులు తీసుకున్న పారితోషికం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో వైఎస్‌ఆర్ పాత్రలో నటించిన మమ్ముట్టి రూ.20 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్ జగన్ పాత్రలో నటించిన జీవా రూ.10 కోట్లు.. మిగతా నటీనటులకు కలిపి రూ.5 కోట్లు వరకు ఖర్చు అయినట్లు టాక్ వినిపిస్తోంది.

READ MORE: Pawankalyan: ‘యాత్ర-2’కి పోటీగా.. పవన్ కల్యాణ్ మూవీ రీ-రిలీజ్.. ఏపీ ఎన్నికలే టార్గెట్..?

ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ ‘యాత్ర 2’ను ఎప్పుడు ఓటీటీలోకి తీసుకువస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News