BigTV English

Bihar Floor Test: బలపరీక్ష లో నితీశ్ కుమార్ గెలుపు.. ఐదుగురు విపక్ష సభ్యులు మద్దతు!

Bihar Floor Test: బలపరీక్ష లో నితీశ్ కుమార్ గెలుపు.. ఐదుగురు విపక్ష సభ్యులు మద్దతు!

Bihar Floor Test Highlights: బిహార్‌ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బలపరీక్షలో సీఎం నితీశ్ కుమార్ గెలిచారు. అంచనా కంటే 4 ఓట్లు ఎక్కువగానే నితీశ్ సాధించారు. 129 మంది సభ్యుల మద్దతు ఆయనకు లభించింది. ఐదుగురు విపక్ష సభ్యులు ఆయనకు మద్దతు నిచ్చారు. సభ విశ్వాసం నితీశ్ పొందిన సమయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.


బీజేపీ, జేడీ (యూ) నేతృత్వంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన సమయంలో వేళ ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇటు బీజేపీ, జేడీ (యూ).. అటు ఆర్జేడీ తమవంతు ప్రయత్నాలు చేశాయి.

బిహార్‌లో నితీశ్‌ కుమార్ ప్రభుత్వానికి తగినంత బలం ఉంది. సభ విశ్వాసం పొందడం సులభమే. బీజేపీ సపోర్ట్‌తో సునాయాసంగానే బలపరీక్ష గండం గట్టెక్కుతుందని భావించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తన వ్యూహాలకు పదును పెట్టింది. తన బలాన్ని ప్రదర్శించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఈ సమయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి.


బిహార్ లో సోమవారం బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. తొలుత గవర్నర్‌ ప్రసంగించారు. ఆ తర్వాత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ద్వారా స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించారు. బీజేపీ-జేడీయూ నేతలు ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్వీకర్ పై అవిశ్వాసాన్ని పెట్టారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత బలపరీక్ష జరింగిది. ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎన్డీఏ పక్షాన కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ లో నితీశ్ కు అనుకూలంగా ఓటేశారని తేలింది.

Read More: Bihar Floor Test : బీహార్ ప్రభుత్వ భవితవ్యం తేలేది నేడే.. అసెంబ్లీలో బలపరీక్ష

అంతకుుముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. జేడీ(యూ) ఆ పార్టీ సభ్యులకు విప్‌ జారీ చేసింది. పాట్నాలో ఓ హోటల్ లో బస చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బీజేపీ-జేడీ(యూ) శిబిరం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మిస్సైయ్యారు. అయితే వారిలో ఏడుగురు తిరిగివచ్చేశారు. మరొకరు జాడ తెలియలేదు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను పట్నాలోని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ఇంటికి తరలించారు. అయితే ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌ను హౌస్ అరెస్ట్ చేయడంపై వివాదం రేగింది. ఈ ఘటనపై ఆయన సోదరుడు పోలీసులకు కంప్లైట్ చేశారు. దీంతో తర్వాత ఆయన ఇంటికి వచ్చేశారు. చేతన్ ఆనంద్ ఓటింగ్‌కు దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి.

ఆ సమయంలో ఆర్జేడీ నేత తేజస్వి నివాసం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై ఆర్జేడీ నేతలను మండిపడ్డారు. సీఎం నితీశ్‌ కుమార్‌, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని బిహార్‌ ప్రజలు గమనిస్తున్నారని ఆర్జేడీ నేతలు అన్నారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Tags

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×