E-Paper
Advertisement

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి, ఘటన ఎలా జరిగింది?

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి, ఘటన ఎలా జరిగింది?
Advertisement

Gokarna Beach: టెక్కీ కంపెనీ ఉద్యోగుల సరదా కాస్త విషాదంగా మారింది. సముద్రంలో తీవ్రమైన అలల తాకిడికి గురై ముగ్గురు టెక్కీలు కొట్టుకుపోయారు. మరో ఇద్దర్ని మాత్రమే సిబ్బంది కాపాడారు. ఈ ఘటన కర్ణాటకలోని గోకర్ణ బీచ్ సమీపంలో వెలుగు చూసింది. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

విహారయాత్రలో విషాదం

బెంగుళూరు వేదికగా ఉన్న ఓ ఐటీ కార్యాలయానికి చెందిన పలువురు ఉద్యోగులు వీకెండ్‌లో బయటకు వెళ్లారు. విహారయాత్ర కోసం కర్ణాటకలోని గోకర్ణకు వెళ్లారు. కేవలం ఐదుగురు ఆదివారం గోకర్ణ బీచ్‌కు వెళ్లారు. నీటిలోకి దిగిన కాసేపటికే అలలు ఉధృతి తీవ్రమైంది. ఐదుగుర్ని అలలు లాక్కుపోయాయి. వారిలో ఇద్దర్ని లైఫ్‌గార్డులు, స్థానిక మత్స్యకారులు రక్షించారు. ఘటన తర్వాత సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆ ముగ్గుర్నీ రక్షించలేకపోయారు.

ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి

Advertisement

ఘటన జరిగి నాలుగైదు గంటల తర్వాత మృతదేహాలను బయటకు వచ్చాయి. మృతులను 22 ఏళ్ల శోభా దాస్ జార్ఖండ్‌కు చెందిన యువతి. మహమ్మద్ అక్రమ్ ఇస్మాయిల్ అహ్మద్, 24 ఏళ్ల విశ్వ ఏకేగా గుర్తించారు. ముగ్గురు బెంగళూరుకు చెందిన అలోరికా ఎకోపేస్ అనే కంపెనీలో పని చేస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన 16 మంది ఉద్యోగుల బృందం శనివారం సాయంత్రం గోకర్ణకు వెళ్లింది. సముద్ర తీరానికి సమీపంలో ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేశారు. ఆదివారం ఆ బృందంలోని ఐదుగురు దుబ్బనశాశి బీచ్‌కు దిగారు.

బలమైన అలలు వారిని లాక్కుపోయాయి. నీటిలో నుంచి రావడానికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగినట్లు తెలియగానే సహాయక చర్యలు ప్రారంభించారు. లైఫ్‌గార్డులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో ఇద్దరిని సురక్షితంగా రక్షించారు. నిశాంత్ డివి, మహమ్మద్ ఖాసింలుగా గుర్తించారు. చికిత్స కోసం గోకర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదం అనంతరం గోకర్ణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

ALSO READ: అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?

Related News

అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?

ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!

అమెరికా పౌరుడివై ఉండి భారత్‌లో నిరసనలా? ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు ఫైర్!

ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు దుర్మరణం!

Big Stories

Advertisement
×