E-Paper
Advertisement

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..
Advertisement

Podarillu Today Episode November 5th : గుడికి వెళ్లగానే అక్కడున్న పూజారి ప్రవర్తన చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ పూజ ఏంటి ఇంత వింతగా విచిత్రంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అమ్మాయిలని చూస్తున్నాడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అని చెప్పగానే పూజారి దొంగ కళ్ళు పట్టుకునే వాడిలాగే ఉన్నాడు. వీడు చేత ప్రక్షాళన పూజ చేయిస్తాను పాపాన్ని కడిగేస్తాను అంటూ చేతిలో హారతి ఇవ్వాలి అని చెప్పగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పూజారి మాత్రం అస్సలు వదలకుండానే చేతిలో హారతి ఇవ్వడానికి కర్పూరం పెట్టి వెలిగిస్తాడు. మొత్తానికి చక్రీకి చుక్కలు కనిపిస్తాయి.. ఇక తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని అనగానే అందరూ కూడా చక్రీని వెళ్ళమని చెప్తారు..

చక్రీ ఇక మారాడ..?

చక్రి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని పంపిస్తే తను మాత్రం వెళ్లి అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటాడు అది చూసిన కన్నా.. అందరినీ అక్కడికి పిలుచుకొని వస్తారు. అయితే చక్రిని చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవడంతో పాటుగా తనపై సీరియస్ గా ఉంటారు.. ఇకపోతే పూజ అవ్వగానే ఇంటికి రాగానే చక్రి నన్ను అసలు పట్టించుకోవడమే లేదు పొద్దున్నుంచి ఈ పూజ అయ్యేంతవరకు ఏమీ తినదన్నారు కానీ ఇప్పటికి నాకు ఏది పెట్టట్లేదు అని బాధపడిపోతూ ఉంటాడు. చక్రి మాటలు విన్న వాళ్లు నువ్వే చేసుకుని తిను అని అంటారు. అయితే మాధవ్ మనిషా కోసం వెళ్లాలి అని చెప్పగానే మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో మాధవ్ ని తన తమ్ముళ్లు చాలా స్టైలిష్ గా తయారు చేస్తారు.. అటు మనిషా కూడా అలానే రెడీ అవ్వడంతో అందరూ కూడా షాక్ అవుతారు..

హీరోగా మారిన మాధవ్..

Advertisement

చక్రి పూజ తర్వాత నాకు ఆకలి ఆకలి అని ఎంత ఇస్తూ ఉంటాడు. అయితే చక్రిని పక్కన పెట్టేసి నువ్వు మనిషా దగ్గరికి వెళ్ళాలి అనుకున్నావు కదా.. వెళ్ళు అని అందరూ మాధవ్ని రెడీ అవమని చెప్తారు. అయితే లోపలికి వెళ్ళిన మాధవ్ పంచకట్టులో బయటకు రావడం చూసి నువ్వు ఏమైనా పెళ్లికి వెళ్తున్నావ్ అన్నయ్య ఇంత పద్ధతిగా రెడీ అయ్యావు అని అడుగుతారు. దానికి అదేంటిరా నేను బాగానే రెడీ అయ్యాను కదా.. ఇప్పుడు ఏమైంది అని అంటే నువ్వు పెళ్లికి వెళ్లట్లేదు పెద్ద మనిషి లాగా ఉన్నావు డేటింగ్ వెళ్ళాలి అంటే ఒక స్టైల్ గా ఉండాలి అని మహా చెప్తుంది. ఇక కన్నా నాకు బాగా అర్థమైంది అన్నయ్యను నేను చిటికెలో రెడీ చేసి తీసుకొని వస్తాను అని అంటాడు.

పెద్దిని చూసిన కామెంట్స్..

పెద్ది హీరో లాగా రెడీ అవ్వడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ది హీరో హీరో భాష అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే స్టైల్ గా నడవడం కూడా నేర్చుకోవాలి అని చెప్పడంతో అందరూ కూడా మాధవ్ స్టైల్ ని చూసి కాసేపు కామెడీగా నవ్వుకుంటారు ఇక కన్నా ఎలా నడవాలి అని చెప్పడంతో మాధవ్ అలా నడవడంతో భాషా భాషా అంటూ అందరూ తమ్ముళ్ళతోపాటు మా మహా కూడా కామెంట్స్ చేస్తుంది. ఇక కేశవ తన బండిని ఇచ్చి అన్నయ్యని డేటింగ్ కి వెళ్ళమని పంపిస్తాడు మొత్తానికి ఈ ఎపిసోడ్కి మాధవ్ గెటప్ హైలెట్గా నిలుస్తుంది. వీళ్ళందరూ కలిసి మాధవ్ చాలా సంతోషంగా ఉన్నాడు అన్నయ్యని ఇలా చూసి చాలా రోజులైంది అని అందరూ అనుకుంటారు. మొత్తానికి మాధవ్ మనిషా తో డేటింగ్ వెళ్లడానికి అని చాలా స్టైల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు.

మనిషా షాక్..

Advertisement

మనిషా మాధవ్ ని అలా బైక్ మీద రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాగున్నారు అంటూ తన భాషలో చెప్పడంతో అందరూ కూడా నిజంగానే మాధవ్ చాలా బాగున్నారు కానీ అనుకుంటారు. ఇకపోతే వీళ్ళిద్దరూ కలిసి బైక్ మీద లాంగ్ డ్రైవ్ గా అలా చెరువుగట్టుకు వెళ్తారు. అక్కడ ఆ చెరువు అందాలను చూసి మనీషా చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే నువ్వు ఇలా సంతోషంగా చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తున్నావే అని మాధవ్ అడుగుతాడు మొత్తానికి మనిషా మాధవ్ ఇద్దరు కలిసి చాలా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మొత్తానికి మనిషా మాధవ్ ని చూసి శైలు కూడా వీడి బండి వీళ్లనేకిచ్చి నన్ను తీసుకెళ్లకుండా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.

చక్రిని తిట్టినా మహా..

మహాలక్ష్మి ఏంటి ఏదో గాల్లో లెక్కలు వేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మాత్రం నేను ఏమీ వేయలేదు మీరు ఏదేదో అనుకుంటున్నారు అని అంటాడు.. ఇక అన్నయ్య మనీషాతో బయటికి వెళ్లిన తర్వాత ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ మాట మహాలక్ష్మితో చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సిగ్గు లేదా కొంచెం కూడా అన్నయ్య వదిన తో బయటికి వెళ్తే ఇలా ఆలోచిస్తావా నువ్వు అని అంటుంది ఇక చక్రి గురించి టాపిక్ రావడంతో మహాలక్ష్మి కుళ్ళుకుంటుంది అని చక్రి బయట పెడతాడు. మీరెవరో నేనెవరో మీ గురించి నేను కుళ్ళుకోవడమేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే వీళ్ళిద్దరి ఫైట్ కూడా ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి శైలు వచ్చి మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అని చెప్పగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది చూడాలి.. మొత్తానికైతే ఇక్కడితో ఎపిసోడ్ సరదాగా సాగుతుంది. రేపటి ఎపిసోడ్లో మనిషని తన బావ కిడ్నాప్ చేస్తాడని అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Thursday TV Movies : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×