Karthika Deepam 2 serial today Episode: ఆఫీసులో సూరజ్ లంచ్ బాక్స్ జ్యోత్స్న తినడం.. జ్యోత్స్న లంచ్ బాక్స్ సూరజ్ తినడం చూసిన మాలిని అదే విషయం గుర్తు చేసుకుని రగిలిపోతుంది. వెంటనే కాంచన ఇంటికి వెళ్తుంది. ఎందుకొచ్చావని కార్తీక్ అడిగితే.. శ్రీధర్‌తో మాట్లాడటానికి వచ్చానని చెప్తుంది. శ్రీధర్ ఏంటో చెప్పమని అడిగితే.. శ్రీధర్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీకు అసలు సిగ్గు ఉందా..? రెండు పూటల తిండి ఎలా తినాలనిపిస్తుంది బావగారు. నీ కొడుకు నీ కోడలు నా దగ్గర పని చేయడానికి వస్తుంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదా..? అంటూ ప్రశ్నిస్తుంది.
అందుకు శ్రీధర్ వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు అని చెప్తాడు. అందుకు మాలిని కోపంగా అయితే నీకేం సంబంధం లేదా..? కార్తీక్ నీకు కన్నకొడుకే కదా ఎక్కడో దొరికితే తెచ్చుకుని ఏం పెంచలేదు కదా..? నువ్వో అసమర్థ తండ్రివి అంటూ తిడుతుంది. కార్తీక్ కోపంగా మాలిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెబితే.. శ్రీధర్ అడ్డుపడి ఉండనివ్వు కార్తీక్ ఇంకా ఏంటో మాట్లాడని అంటాడు శ్రీధర్. మాలిని కోపంగా శ్రీధర్ తిట్టి కాంచనను కూడా తిడుతుంది. కడుపుతో ఉన్న కోడలిని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని చెప్పలేవా..? ఈరోజు ఆర్డర్ విషయంలో కార్తీక్, దీపలు అందరి ముందు దోషుల్లా నిలబడ్డారు..అంటూ తిడుతుంటే.. కాంచన కోపంగా మాలిని ఇక చాలు ఆపు అంటూ అరుస్తుంది. అయినా వినకుండా మాలిని తిడుతూనే ఉంటుంది.
జ్యోత్స్న కోపంగా మాలినిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్తుంది. అందుకు మాలిని ఇంత దూరం వచ్చాక ఆడపడుచుతో మాట్లాడకపోతే ఎలా మేనకోడలా.. ?ఉండు వెళ్తాను.. అంటూ సుమిత్రను చూస్తూ.. అసలు నీ కూతురును నా ఆఫీసుకు ఎందుకు పంపుతున్నావు.. నీ కూతురు నా కొడుకుతో కలిసి భోజనం చేయడానికా..? ఓహో నా కొడుకు కోటీశ్వరుడు కదా మీరిప్పుడు తిండికి గతిలేని బతుకులు బతుకుతున్నారు.. అందుకే నీ కూతురును నా కొడుకును వలలో వేసుకోమని పంపావా..? అంటూ తిడుతుంది. ఆ మాటలకు జ్యోత్స్న కోపంగా అత్తా అంటూ గట్టిగా అరుస్తుంది. మా అమ్మానాన్నలకు నా మీద నమ్మకం ఉంది కాబట్టే ఆఫీసుకు పంపుతున్నారు అంటూ జ్యోత్స్న చెప్పినా మాలిని వినకుండా సుమిత్రా ఇక నీ కూతురిని నా కొడుకు వెంట పడొద్దని చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మాలిని.
మాలిని వెళ్లిపోయాక అందరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటుంటారు. శివనారాయణ కోపంగా తాను ఇంట్లో ఉండనని దశరథకు చెబితే.. జ్యోత్స్న వెళ్లి సముదాయిస్తుంది. తాను ఆఫీసుకు వెళ్లకపోతే మీకు ఓకేనా తాత అంటుంది. సుమిత్ర వచ్చి ఏదో చెప్పబోతుంటే.. వద్దు మమ్మీ మాలిని అత్త కావాలనే వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టింది. మమ్మల్ని అక్కడ పని చేయకుండా ఆపేందుకు ప్లాన్ చేసింది. అక్కడ మేము ఉంటే తన ఆటలు సాగడం లేదు. పైగా మేం ఏం చేస్తామోనని భయంతో ఇలా మాట్లాడింది అంటూ ఇప్పుడు తాము ఆఫీసుకు వెళ్లడం మానేస్తే ఆ మాలిని గెలిచినట్టు ఫీల్ అవుతుంది తాత. మనం ఓడిపోయిన వాళ్లం అవుతాం అంటుంది జ్యోత్స్న.
తర్వాత శ్రీధర్, కార్తీక్ దగ్గరకు వెళ్లి అక్కడ పని చేయడం మానేయమని చెప్తాడు. అందుకు కార్తీక్ ఒప్పుకోడు.. తాను కరెక్ట్‌గానే చేస్తున్నానని.. శ్రీధర్‌కు చెప్తాడు. తర్వాత కార్తీక్, దీప, జ్యోత్స్న ముగ్గురు కలిసి మాలినికి బుద్ది చెప్పి సూరజ్‌ను మాలినికి దూరం చేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.