E-Paper
Advertisement

భార్యకు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు.. అవసరం లేదన్న హై కోర్టు.. కారణాలివే

భార్యకు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు.. అవసరం లేదన్న హై కోర్టు.. కారణాలివే
Advertisement

Wife No Maintenance Case| భార్యకు ఉద్యోగం, సంపాదన ఉన్నప్పటికీ భర్త నుంచి భరణం కోరవచ్చా? భర్తపై ఇతర ఆర్థిక బాధ్యతలున్నా భరణం చెల్లించాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలకు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు

ఈ కేసులో భార్య 2019లో ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. తనకు చదువు లేదని, ఉద్యోగం లేదని, సొంత ఆదాయం కూడా లేదని పేర్కొంటూ భరణం కోరింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు భర్తకు నెలకు రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ భర్త అలహాబాద్ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు.

భార్య నెల జీతం రూ.36,000 అని తేల్చిన కోర్టు

Advertisement

భార్య విద్యార్హతలు, ఉద్యోగ వివరాలను భర్త కోర్టు ముందు ఉంచాడు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిందని, వెబ్ డిజైనింగ్‌లో అర్హతలు కలిగి ఉందని తెలిపాడు. అంతేకాకుండా, ఆమె ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీలో సీనియర్ సేల్స్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నట్లు ఆధారాలు సమర్పించాడు. భార్య తన అఫిడవిట్‌లో నెలకు రూ.34,000 జీతం పొందుతున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టులో విచారణ సమయంలో నెలకు రూ.36,000 సంపాదిస్తున్నట్లు అంగీకరించింది. ఆమెకు ఇతర ఆర్థిక బాధ్యతలు లేదా ఆధారపడిన వ్యక్తులు లేరని కోర్టు గుర్తించింది. మరోవైపు, భర్తపై వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంది.

ఆదాయం దాచిపెట్టడంపై హైకోర్టు అసంతృప్తి

భరణం కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో భార్య తన ఉద్యోగం, ఆదాయ వివరాలను వెల్లడించలేదు. తాను చదువుకోలేదని, ఉద్యోగం లేదని పేర్కొంది. కానీ విచారణ సమయంలో తన ఉద్యోగం, జీతం గురించి అంగీకరించింది. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టును ఆశ్రయించే ప్రతి ఒక్కరూ వాస్తవాలను పూర్తిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన విషయాలను దాచిపెట్టి న్యాయం కోరడం సరికాదని పేర్కొంది.

Advertisement

Also Read: జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన హైకోర్టు

ఈ సందర్భంగా రేఖా శరద్ ఉషిర్ vs సప్తశృంగి మహిళా నగరి సహకారి పటసంస్థ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. ముఖ్యమైన వాస్తవాలను దాచిపెట్టే వ్యక్తులకు న్యాయం కోరే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read: ఫ్లాట్ దక్కక ముందే కొనుగోలుదారుడు చనిపోతే ఎలా? హోమ్ లోన్, అతడి ఫ్లాట్ ఎవరికి దక్కుతాయి?

భరణం ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు

భార్యకు నెలవారీ ఆదాయం ఉండటంతో ఆమె తనను తాను పోషించుకోగలదని హైకోర్టు అభిప్రాయపడింది. భర్త కుటుంబ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీంతో క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను అనుమతించింది. 2024 ఫిబ్రవరి 17న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన రూ.5,000 భరణం ఆదేశాలను రద్దు చేసింది.

అయితే, ఉద్యోగం చేస్తున్న ప్రతి భార్యకు భరణం నిరాకరిస్తారని ఈ తీర్పు అర్థం కాదు. ప్రతి కేసులో ఆదాయం, ఆర్థిక అవసరాలు, బాధ్యతలను న్యాయస్థానాలు విడివిడిగా పరిశీలిస్తాయి.

Related News

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి, ఘటన ఎలా జరిగింది?

అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?

ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!

అమెరికా పౌరుడివై ఉండి భారత్‌లో నిరసనలా? ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు ఫైర్!

ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి

Big Stories

Advertisement
×