E-Paper
Advertisement

అద్దె విషయంలో గొడవ.. వీధి రౌడీలా రెచ్చిపోయిన వ్యక్తి.. వృద్దుడు, మహిళలపై పిడిగుద్దులు!

అద్దె విషయంలో గొడవ.. వీధి రౌడీలా రెచ్చిపోయిన వ్యక్తి.. వృద్దుడు, మహిళలపై పిడిగుద్దులు!
Advertisement

Surat Shocker: గుజరాత్ లోని సూరత్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హీరాబాగ్ ప్రాంతంలోని సంతాలాల్ సొసైటీలో ఇంటి అద్దె విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం.. హింసాత్మక దాడికి దారితీసింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళలపై విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ సంఘటనను అక్కడే ఉన్న కొందరు మొబైల్ కెమెరాలో చిత్రీకరించడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

హీరాబాగ్ సంతాలాల్ సొసైటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటికి సంబంధించిన అద్దె, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన పరేష్ అనే వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తనతో వాగ్వాదానికి దిగిన మహిళలపై భౌతిక దాడికి దిగాడు. ఈ దాడిలో ఓ వృద్ధుడితో పాటు మరికొందరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అందరూ చూస్తుండగానే పరేష్.. వృద్ధుడు, ఇతర మహిళలపై చేయి చేసుకున్న దృశ్యాలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ దాడికి పాల్పడిన వ్యక్తికి.. బాధిత మహిళలకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది తెలియరాలేదు.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

Advertisement

ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలోకి చేరడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి. వృద్ధుడు, మహిళలపై జరిపిన విచక్షణారహిత దాడిని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు దాడి దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక అశ్విని కుమార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? గాయపడిన మహిళల ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: అమెజాన్ దీపావళి ధమాకా.. రూ. 20 వేలలో 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు.. ఇది కదా పండగ ఆఫరంటే!

వీడియో ఆధారంగా నిందితుడిపై చర్యలు

అయితే ఈ తరహా క్రూరమైన దాడి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. దౌర్జన్యం, భౌతిక దాడులకు తెగబడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సూరత్ లో చోటుచేసుకున్న ఘటన సైతం నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు ఈ దాడి దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని గుర్తించడానికి దాడి వీడియోనే పోలీసులకు ప్రధాన ఆయుధంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అయితే దాడికి ముందు అసలు ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు.. స్థానికులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Also Read: SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ పథకాల్లో డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా ‘జీతం’ గ్యారెంటీ!

Tags

Related News

త్రిపురలో ఘోరం.. BSF జవాన్లపై కర్రలతో దాడి.. ఆయుధాలు సైతం లాక్కొని..!

భార్యకు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు.. అవసరం లేదన్న హై కోర్టు.. కారణాలివే

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి, ఘటన ఎలా జరిగింది?

అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?

ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!

అమెరికా పౌరుడివై ఉండి భారత్‌లో నిరసనలా? ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×