E-Paper
Advertisement

Jammu Kashmir Encounter: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం..

Jammu Kashmir Encounter: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం..
Advertisement

Four Terrorists Killed In An Encounter: జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా మోడెర్గామ్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందినట్లు పేర్కొన్నారు.

కుల్గాం జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని.. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని పేర్కొన్నారు. ఫ్రిసల్ చిన్నిగాం, మోడెర్గామ్ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిందని వారు స్పష్టం చేశారు.

Advertisement

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో నాలుగు మృతదేహాలు పడి ఉన్నట్లు డ్రోన్ ఫుటేజీలో తేలిందని అన్నారు. ఈ ప్రాంతాన్ని కాశ్మీర్ ఐజీ వీకే బిర్దీ సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌ ఇంకా ముగియలేదని అన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం భద్రతా దళాలకు గణనీయమైన విజయం అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

గత నెలలో, పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×