BigTV English

International: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తెలంగాణ వాసులు

International: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తెలంగాణ వాసులు

Two Telangana people defeated in Britain elections who participated 


ఇటీవల జరిగిన బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో లేబర్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుని అధికార పార్టీ హోదా దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికలలో పోటీ చేసిన కన్జర్వేటివ్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి119 స్థానాలు సాధించింది. లేబర్ పార్టీ 403 సీట్ల ఆధిక్యంతో భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే స్థానికంగా అక్కడ స్థిరపడిన తెలంగాణ వాసులు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇద్దరిలో ఒకరు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు దూరపు బంధువయిన ఉదయ్ నాగరాజు. ఈయనకు ప్రముఖ రచయిత పైగా అంతర్జాతీయ వక్తగా పేరు ఉంది.మరొకరు జనరల్ ప్రాక్టీషనర్ గా సేవలు అందిస్తున్న చంద్ర కన్నెగంటి. వీరిద్దరూ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన మూలాలు ఉన్నవారు కావడం విశేషం.

ఒకరు లేబర్ పార్టీ ..మరొకరు కన్జర్వేటివ్


ఉదయ్ నాగరాజు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందినవారు. ఈయన నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ స్థానం నుంచి లేబర్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర కన్నెగంటి కన్జర్వేటివ్ పార్టీ తరపును పోటీ చేసి ఓడిపోయారు. ఈయన స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీచేశారు. 6221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. గతంలో ఇదే స్థానం నుంచి రెండు సార్లు కౌన్సిలర్ గా, మరో సారి మేయర్ గా పనిచేశారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×