E-Paper
Advertisement

Sharad Mohol : సొంత ముఠా సభ్యులే కాల్పులు.. పుణెలో గ్యాంగ్‌స్టర్ హత్య..

Sharad Mohol : పుణెలో గ్యాంగ్‌స్టర్‌ శరద్‌ మోహల్‌ (40)పై అతడి గ్యాంగ్‌ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్‌కు గ్యాంగ్‌ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Sharad Mohol : సొంత ముఠా సభ్యులే కాల్పులు.. పుణెలో గ్యాంగ్‌స్టర్ హత్య..
Advertisement

Sharad Mohol : పుణెలో గ్యాంగ్‌స్టర్‌ శరద్‌ మోహల్‌ (40)పై అతడి గ్యాంగ్‌ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్‌కు గ్యాంగ్‌ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రక్తపు మడుగులో పడి ఉన్న శరద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐదు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో శరద్‌ మోహల్‌పై అనేక పోలీస్‌స్టేషన్లలో దోపీడి, హత్య కేసులు నమోదయ్యాయి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×