E-Paper
Advertisement

Delhi murder news : ఢిల్లీలో ఇద్దరు మహిళల హత్య.. ఏం జరుగుతోంది?

Delhi murder news : ఢిల్లీలో ఇద్దరు మహిళల హత్య.. ఏం జరుగుతోంది?
Advertisement
Delhi news today

Delhi news today(Latest breaking news in telugu) :

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలోని కమలా నెహ్రూ కాలేజీకి చెందిన ఓ యువతిని పట్టపగలే పార్క్‌లో అతి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. సౌత్‌ ఢిల్లీలోని మాల్వియా నగర్‌ పార్క్‌లో ఈ దారుణం జరిగింది. చనిపోయిన యువతిని నర్గీస్‌గా గుర్తించారు. ఆమె తలపై గాయాలు ఉండటంతో ఇనుప రాడ్‌తో దాడి చేయడం వల్లే చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.

నర్గీస్‌ తన బంధువైన ఇర్ఫాన్‌ అనే యువకుడితో పార్క్‌కు వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. అక్కడే ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. ఆమె పెళ్లికి నిరాకరించడంతో పక్కనే ఉన్న రాడ్‌తో ఆమె తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నర్గీస్ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇర్ఫాన్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి ఇంట్లో వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో నర్గీస్‌ తనతో మాట్లాడటం మానేసిందని ఇర్ఫాన్ పోలీసులకు తెలిపాడు. ఇప్పుడు నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినా.. అంగీకరించకపోవడంతోనే కొట్టినట్టు దర్యాప్తులో తెలిపాడు ఇర్ఫాన్.

ఢిల్లీలో గత 24 గంటల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. వరుస హత్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ జరిగాక ఢిల్లీ సురక్షితం అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఢిల్లీలో మహిళల భద్రతపై ఎవరికీ పట్టింపు లేదని.. దేశ రాజధానిలో నేరాలు ఆగకపోవడం బాధాకరమన్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×