BigTV English

Manipur Updates: మణిపూర్‌కు INDIA టీమ్.. బీజేపీకి ఝలక్..

Manipur Updates: మణిపూర్‌కు INDIA టీమ్.. బీజేపీకి ఝలక్..
Manipur violence news latest

Manipur violence news latest(Politics news today India): హింసాత్మకత ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను విఇండియన్‌ నేషనల్‌ డెవల్‌పమెంటల్‌ ఇంక్లూసివ్‌ అలయన్స్‌కు చెందిన ఎంపీల బృందం వెళ్లనుంది. శనివారం 20 మందికిపైగా ఎంపీలు ఉండే ఈ బృందం మణిపూర్‌లో పర్యటించనుంది. రెండు రోజల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.


మణిపూర్‌లో పర్యటించాలని ఎంపీలు ఎప్పటినుంచో భావిస్తున్నా భద్రతా కారణాల పేరుతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం విపక్ష కూటమి సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించి మణిపూర్‌ సీఎం, గవర్నర్‌కు లేఖ రాశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డు మార్గంలో కాకుండా.. నేరుగా హెలికాప్టర్లలో బాధితుల వద్దకు చేరుకోనున్నారు విపక్ష కూటమి ఎంపీలు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు ఉన్నాయి. మణిపుర్‌ అంశంపై ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మోడీ సర్కారుపై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా దానికి అనుమతి ఇచ్చారు. మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు రోజూ డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఉభయ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×