E-Paper
Advertisement

కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!
Advertisement

Gujarat Crime: గుజరాత్ లోని జామ్ నగర్ లో క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో 12 అడుగులు గుంత తవ్వి పాతేసి.. భర్త విదేశాల్లో ఉన్నట్లుగా గత రెండేళ్లుగా అతడి కుటుంబ సభ్యులను నమ్మించింది. చివరికి భార్య చేసిన దారుణం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సమాధి చేసిన ప్రాంతంలో భర్తవిగా భావిస్తున్న ఎముకలను తవ్వి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసుల కథనం ప్రకారం.. జిగ్నేష్ మావిడియా, పృథ్వీ భార్య భర్తలు. అయితే భర్త జిగ్నేష్ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పృథ్వీని ప్రశ్నించారు. అయితే ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాడని ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడని ఆమె చెప్పడంతో అదంతా నిజమని నమ్మి మిన్నకుండిపోయారు. అయితే గత రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండగా.. ఇటీవల జిగ్నేష్ సోదరుడు అశోక్ మావిడియా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ అన్న జిగ్నేష్ ఆచూకి కోసం వెతగ్గా ఎక్కడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. కుటుంబ సభ్యులకు చెప్పాడు.

Advertisement

భార్యపై అనుమానం

జిగ్నేష్ నుంచి రెండేళ్లుగా కనీసం కాల్స్ కూడా లేకపోవడంతో.. కుటుంబ సభ్యుల అనుమానం భార్య పృథ్వీ పైకి మళ్లింది. దీంతో వాళ్లు జామ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. రెండేళ్లుగా జిగ్నేష్ కనిపించడం లేదని.. భార్యపైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పృథ్వీని పిలిపించి.. విచారణ చేయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. చివరికి తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా.. తన భర్తను రెండేళ్ల క్రితమే ప్రియుడు నిలేశ్ తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది.

Advertisement

Also Read: ప్రకృతి చెక్కిన శిల్పాలు.. సూర్యాపేట గుట్టల్లో అద్భుతం.. చూసేందుకు క్యూ కట్టిన జనం!

మద్యంలో సైనేడ్ కలిపి..

మద్యంలో సైనేడ్ కలిపి జిగ్నేష్ కు ఇచ్చినట్లు భార్య పృథ్వీ పోలీసుల ముందు ఒప్పుకుంది. అనంతరం అతడు చనిపోయాక దారేడ్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద 12 అడుగుల మేర గుంత తవ్వి పాతిపెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో పృథ్వీతో పాటు ఆమె ప్రియుడు నిలేశ్ ను  పోలీసులు అరెస్టు చేశారు. ఫ్యాక్టరీలో పాతిపెట్టిన మృతదేహానికి సంబంధించిన ఎముకలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎముకలు జిగ్నేష్ వే అని పక్కా ఆధారాలు లభించిన తర్వాత.. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ మీడియాకు వెల్లడించారు.

Also Read: విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!

Related News

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం

కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ నిబంధన చెల్లదు!

మరణించిన రెండేళ్లకు క్లీన్ చీటా? సుప్రీం తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ అసహనం!

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!

అధికారికి ఒక్క వాహనం.. రెండో వాహనానికి నో ఛాన్స్, కేంద్రం కొత్త రూల్స్

రష్యన్ క్షిపణుల దాడి.. బ్లాక్ సీలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు!

Big Stories

Advertisement
×