E-Paper
Advertisement

విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!

విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!
Advertisement

Luxury First Class: విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణం అనగానే అందరికీ గుర్తొచ్చేది మెరుగైన సౌకర్యాలు, హాయిగా ఉండే సీటు. కానీ ‘జపాన్ ఎయిర్‌లైన్స్’ (JAL) ఆ అనుభూతిని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. తన కొత్త ‘ఎయిర్‌బస్ A350-1000’ విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం ఏకంగా ఒక ప్రైవేట్ రూమ్‌నే డిజైన్ చేసింది. అయితే టోక్యో నుంచి లండన్ ప్రయాణించే ఈ విమానం ఫస్ట్ క్లాస్ టికెట్ ధరను ఏకంగా 25 లక్షల యెన్లు కావడం గమనార్హం. అంటే భారతీయ కరెన్సీలో రూ. 15 లక్షలకు పైమాటే. ఇంతకీ ఈ విమానంలోని ఫస్ట్ క్లాస్ సూట్ ప్రత్యేకతలు, అందులో ట్రావెల్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్ క్లాస్ సూట్ ప్రత్యేకతలు

సాధారణంగా విమానాల్లో అందరికీ కనిపించేలా ఒక సీటును మాత్రమే కేటాయిస్తారు. కానీ ఈ జపాన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణికుడికి ఒక పూర్తి స్థాయి ప్రైవేట్ ‘సూట్’ అందుబాటులోకి వస్తుంది. తోటి ప్రయాణికులకు కనిపించకుండా దీనికి స్లైడింగ్ డోర్ సైతం ఇస్తారు. విమానం గాల్లోకి లేచిన తర్వాత ఈ డోర్ వేసుకుంటే.. 14 గంటలకు పైగా సాగే ప్రయాణంలో ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా గడపవచ్చు. ఈ విమానంలో కేవలం 6 ఫస్ట్ క్లాస్ సూట్లు మాత్రమే ఉండటం గమనార్హం. 1-1-1 వరుసలో అమర్చడం వల్ల లోపల చాలా విశాలంగా ఉంటుందని ఎయిర్ లైన్స్ వర్గాలు చెబుతున్నాయి.

డబుల్ బెడ్‌లా మారే సీటు

Advertisement

ఈ సూట్‌లో ఒక ప్రధాన సీటుతో పాటు పక్కనే మరో చిన్న కుర్చీ కూడా అందుబాటులో ఉంటుంది. చదువుకోవడానికి, సినిమా చూడటానికి ప్రైమరీ సీటు సోఫాలా ఉపయోగపడితే.. భోజనం చేయడానికి లేదా పని చేసుకోవడానికి పక్కనున్న సీటు టేబుల్ గా మారిపోతుంది. నిద్రపోయే సమయంలో మెయిన్ సీట్ ను రెండు మీటర్ల పొడవైన ఫ్లాట్ బెడ్‌గా మార్చుకోవచ్చు. అవసరమైతే పక్కనున్న కుర్చీని కూడా కలిపుకొని మరింత విశాలమైన బెడ్ గా మార్చుకోవచ్చు. టోక్యో నుంచి లండన్ వరకు సాగే సుదీర్ఘ ప్రయాణంలో హాయిగా పడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హైటెక్ వినోదం.. ఆధునిక సౌకర్యాలు!

వీవీఐపీ ప్యాసింజర్ల కోసం ప్రతి సూట్‌లోనూ 43 అంగుళాల అతిపెద్ద 4K ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, ఉచిత వైఫై, ఛార్జింగ్ పోర్టులు (USB-A, USB-C), వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని సైతం కల్పించారు. మరోవైపు లగేజ్ బయటకు కనిపిస్తూ.. లగ్జరీ లుక్ ను దెబ్బతీయకుండా సూట్ లోపలే దీనికోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. అలాగే దుస్తులు వేలాడదీసుకోవడానికి వార్డ్‌రోబ్, అద్దం, షూ కౌంటర్, సీసా హోల్డర్లు కూడా అమర్చారు. ప్రయాణికుల కోసం జపనీస్ డిజైన్ స్టూడియో ‘నెండో’ ప్రత్యేకంగా తయారు చేసిన 100% ఆర్గానిక్ కాటన్ దుస్తులను ఈ ఫ్లైట్ లో అందించనున్నారు.

నచ్చిన వంటకం తినొచ్చు..!

Advertisement

ఇక ఆహారం విషయానికొస్తే.. ఈ సూట్ లో వారికి నిర్ణీత సమయమంటూ ఏమీ ఉండదు. ప్రయాణికులు తమకు ఆకలేసినప్పుడు ‘ఆ లా కార్టే’ (A la carte) మెనూ నుంచి నచ్చిన పదార్థాలను ఆర్డర్ చేయవచ్చు. ప్రముఖ మాస్టర్ షెఫ్‌లతో తయారు చేయించిన రుచికరమైన వంటకాలతో పాటు జపాన్ కు చెందిన ప్రీమియం వైన్‌లను కూడా ఆహారంతో పాటు అందిస్తారు.

Also Read: ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

విమానం ఎక్కకముందే రాజభోగం!

ఫస్ట్ క్లాస్ సూట్ కు సంబంధించిన రాజభోగం.. ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుందని ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు చెక్-ఇన్, సెక్యూరిటీ చెకింగ్ వద్ద ప్రత్యేక క్యూలు ఉంటాయి. లండన్ వెళ్లే ముందు టోక్యో హానేడా ఎయిర్‌పోర్ట్‌లోని లగ్జరీ ఫస్ట్ క్లాస్ లాంజ్‌లో ప్రశాంతంగా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. విమానం ఎక్కేటప్పుడు ముందుగా వీరికే ప్రవేశం ఉంటుంది. గమ్యస్థానం చేరుకున్నాక లగేజ్ బెల్ట్ మీద అందరికంటే ముందే వీరి బ్యాగులు వస్తాయి. మెుత్తం మీద విమాన ప్రయాణంలో లగ్జరీ మాత్రమే కాకుండా ‘ఏకాంతం’ (Privacy) కోరుకునే ధనవంతులకు జపాన్ ఎయిర్‌లైన్స్ A350-1000 విమానం.. బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

Also Read: విమానాలు లేవు.. కానీ నంబర్-1 ఎయిర్‌పోర్ట్.. ఖజురహోపై నెట్టింట ట్రోల్స్!

Related News

ఒకే ఒక్క టికెట్‌తో.. ఆటో + బస్సు జర్నీ.. ఆర్టీసీ ఈ-ఆటోలు వచ్చేస్తున్నాయ్!

ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్ట్‌లు వెళ్లే దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

విమానాలు లేవు.. కానీ నంబర్-1 ఎయిర్‌పోర్ట్.. ఖజురహోపై నెట్టింట ట్రోల్స్!

బుల్లెట్ రైళ్ల కోసం స్వదేశీ కంట్రోల్ సిస్టమ్.. భారత్ సంచలన నిర్ణయం!

తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?

అది కొండ కాదు.. బట్టల గుట్ట, అంతరిక్షం నుంచీ కనిపిస్తోంది.. ఇది ఎక్కడుందంటే?

Big Stories

Advertisement
×