E-Paper
Advertisement

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!
Advertisement

Gujarat Divorce: మూడు దశాబ్దాలకు పైగా సాగిన దంపతుల విడాకుల కేసులో గుజరాత్ హైకోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది. 1992 నుంచి భర్తకు దూరంగా ఉంటున్న 65 ఏళ్ల భార్య నుంచి 67 ఏళ్ల భర్తకు విడాకులు మంజూరు చేస్తూ జస్టిస్ ఇలేష్ జే వోరా, జస్టిస్ ఆర్ టీ వాచ్ఛానీల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తగిన కారణం లేకుండానే భార్య భర్తను వదిలేసి వెళ్లిపోయిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆమె జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని నెలవారీ జీవనభృతిని రూ.12,000 నుంచి రూ. 20,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తమ్ముడి బర్త్‌డేకి వెళ్లి… తిరిగి రాని భార్య

ఈ దంపతులకు 1989లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే, రెండో సంతానం కలగడం భర్తకు ఇష్టం లేకపోవడంతో వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 1992 ఆగస్టులో తన తమ్ముడి పుట్టినరోజు వేడుకకు వెళ్లిన భార్య.. ఇక తిరిగి అత్తవారింటికి రాలేదు. దీంతో భార్య తనను తిరస్కరించిందనే కారణంతో భర్త.. 1999లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

ఫ్యామిలీ కోర్టు తీర్పు సవాలు

Advertisement

2015లో ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు.. భర్త మోపిన ఆరోపణలను భార్యపై నిరూపించలేకపోయారని పేర్కొంటూ విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాము 32 ఏళ్లుగా విడిగా ఉంటున్నామని, భార్య తిరిగి రావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. విడిగా ఉండటానికి ఆమె వద్ద సరైన కారణం కూడా లేదని భర్త తరఫు న్యాయవాది వాదించారు.

భార్య అభ్యర్థన.. కోర్టు సానుకూల నిర్ణయం

మరోవైపు భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇద్దరి వయస్సును దృష్టిలో ఉంచుకుని విడాకులు మంజూరు చేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే జీవనభృతిని పెంచాలని కోరారు. అలాగే భర్త పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే సర్వీసు రికార్డుల్లో తననే నామినీగా కొనసాగించాలని అభ్యర్థించారు. దానికి భర్త కూడా ఉదారంగా అంగీకరించారు.

Advertisement

Also Read: రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

మెయింటెనెన్స్ రూ. 20 వేలకు పెంపు

కాగా, కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు.. భార్య విడిగా ఉండటానికి చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవని తేల్చింది. భర్త వేధింపుల వల్లే ఆమె దూరంగా ఉంటోందనే ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును తప్పుబట్టింది. భర్త నెలకు రూ.45,000 పెన్షన్ పొందుతున్నారని.. భార్యకు స్వయం ఉపాధి లేనందున ఆమె సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మెయింటెనెన్స్‌ను రూ.20,000కి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అలాగే భార్య కోరుకున్న విధంగా.. పెన్షన్ నామినీగా ఆమె పేరునే ఉంచేందుకు అనుమతినిస్తూ విడాకులు మంజూరు చేసింది.

Also Read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

Tags

Related News

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Big Stories

Advertisement
×