BigTV English

Hamas-Tunnels : సొరంగాల్లోకి ట్రాకర్ రోబోలు

Hamas-Tunnels : సొరంగాల్లోకి ట్రాకర్ రోబోలు
Hamas-Tunnels

Hamas-Tunnels : గాజా మెట్రోగా పేరొందిన హమాస్ సొరంగ వ్యవస్థను ఛేదించే కీలకదశను ఇజ్రాయెల్ బలగాలు చేపట్టాయి. మిలిటెంట్ల సొరంగ మార్గం సాలెగూడులా ఉంటుంది. న్యూయార్క్ సబ్‌వే కన్నా అత్యంత సంక్టిష్టంగా ఉంటుంది హమాస్ టన్నెల్ నెట్ ‌వర్క్. అందుకే ఇజ్రాయెల్ బలగాలు ఆచితూచి అడుగువేస్తున్నాయి.


బంకర్లను ఛేదించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. అల్-షిఫా ఆస్పత్రిలో సొరంగాన్ని గుర్తించిన అనంతరం ఆర్మీ ఇంజనీర్లు రంగంలోకి దిగారు. ఆ సొరంగాన్ని క్లియర్ చేసే చర్యల్లో భాగంగా తొలుత ఎక్స్‌ప్లోడింగ్ జెల్‌తో దానిని నింపేసి డిటొనేటర్‌ను పేల్చారు. పేలుడు తాలూకు పొగ.. ఆస్పత్రి సమీప రోడ్డులో మూడు పాయింట్ల నుంచి బయటకు వెలువడింది.

గాజా భూఉపరితలానికి దిగువన వందల కిలోమీటర్ల మేర సొరంగ వ్యవస్థ విస్తరించింది. దానిని మ్యాపింగ్ చేసేందుకు ట్రాకర్ రోబోలను దింపడంతో పాటు రిమోట్ పద్దతుల్లో టెక్నాలజీని ఐడీఎఫ్ వినియోగిస్తోంది. మిలిటెంట్లు సొరంగాల్లో ఇరుపక్కలా బూబీ ట్రాప్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున.. వాటిలోకి వెళ్లకుండానే క్లియర్ చేసే విధానాలకే ఇజ్రాయెల్ బలగాలు మొగ్గు చూపుతున్నాయి.


గత వారం 130 సొరంగ ప్రవేశ మార్గాలను సైన్యం ధ్వంసం చేసింది. భూ ఉపరిలతానికి 65-260 అడుగుల దిగువన ఈ సొరంగాల నిర్మాణం జరిగింది. బందీలను హమాస్ మిలిటెంట్లు ఈ సొరంగాల్లోనే ఉంచే అవకాశాలు ఉన్నందున ఇజ్రాయెల్ బలగాలు జాగ్రత్తగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి.

ఇక దక్షిణ గాజా టార్గెట్

ఉత్తర గాజాను దాదాపు స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్.. దక్షిణ గాజాయే తదుపరి లక్ష్యంగా సాగుతోంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని తక్షణమే వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పౌరులను హెచ్చరిస్తూ కరపత్రాలను జారవిడిచాయి. గాజాలో రెండో అతి పెద్ద రద్దీ నగరమిదే.

ఖాన్‌యూనిస్ సమీప పట్టణాలు బని సహీలా, అల్-ఖరారాపై ఇజ్రాయెల్ బాంబులు కురిపించింది. హమాస్ కీలక నేత యాహ్యా సిన్‌వార్ కుటుంబం నివసిస్తున్నది ఖాన్‌యూనిస్‌లోనే. వ్యక్తిగతంగానూ ఆయనకు పట్టున్న ప్రాంతం ఇదే. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే ఉత్తర గాజా నుంచి పాలస్తీనియులంతా ప్రాణాలు అరచేత పట్టుకుని ఈ ప్రాంతానికి తరలివచ్చారు.

Related News

Stray Dog vs Leopard: మనతో మామూలుగా ఉండదు.. పులినే లాక్కెళ్ళిన కుక్క

Kokila Ben: ముఖేష్ అంబానీ తల్లికి అస్వస్థత.. హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలింపు

SC on Stray Dogs: వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×