BigTV English

Delhi: మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ కు వేధింపులు.. వీడియో వైరల్..

Delhi: మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ కు వేధింపులు.. వీడియో వైరల్..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. స్వాతి చేయి కారు లోపల ఉండగానే నిందితుడు వాహనాన్ని ముందకు తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కన్పించాయి.


అసలు ఏం జరిగిందంటే?
ఢిల్లీలో మహిళా భద్రతను పరిశీలించేందుకు స్వాతి మాలీవాల్‌ గురువారం తెల్లవారుజామున నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. 3.05 గంటల సమయంలో ఎయిమ్స్‌ బస్టాండు వద్ద ఉండగా ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. కారులో కూర్చోమని ఆ వ్యక్తి స్వాతిని అడిగాడు. దీనికి ఆమె బదులిస్తూ.. తనకు వినిపించట్లేదన్నారు. ఎక్కడ డ్రాప్‌ చేస్తారు? అని ప్రశ్నించారు. తాను ఇంటికి వెళ్లాలని బంధువులు వస్తున్నారని స్వాతి అతడితో చెప్పారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాసేపటికే మళ్లీ యూటర్న్‌ తీసుకుని వచ్చి ఆమెను మళ్లీ కారులో కూర్చోమని అడిగాడు. దీంతో స్వాతి ఆగ్రహానికి గురయ్యారు. తనను ఎక్కడకు తీసుకెళ్లాలనుకుంటున్నావ్‌? నువ్వు రావడం ఇది రెండోసారి. ఇలాంటివి వద్దని పదే పదే చెబుతున్నా అంటూ కారు డ్రైవర్‌ వద్దకు వెళ్లారు. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపల చేయి పెట్టడంతో అతడు కారు అద్దాన్ని పైకి లేపాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. అలానే కారుని కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ఆమె నొప్పితో కేకలు వేశారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో ఉన్నాయి.


నిందితుడు అరెస్ట్..
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 47 ఏళ్ల హరీష్‌ చంద్రగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు హరీష్ చంద్రకు
న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×