E-Paper
Advertisement

రూ.5,600 కోట్ల స్కామ్.. లక్షా 72 వేల బాధితులు.. చివరికి కిలేడీ అరెస్ట్

రూ.5,600 కోట్ల స్కామ్.. లక్షా 72 వేల బాధితులు.. చివరికి కిలేడీ అరెస్ట్
Advertisement

Hira Gold Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్​ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న నౌషీరా షేక్​ ను ఎట్టకేలకు ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఆమె గుర్గావ్​ లో ఉన్నట్టు పక్కాగా సమాచారాన్ని సేకరించి పట్టుకున్నారు. విచారణలో నౌషీరా షేక్​ మారు పేరుతో, ఫోర్జరీ చేసిన గుర్తింపు పత్రాలతో గుర్గావ్​ లో ఆశ్రయం పొందినట్టుగా వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే..

నౌషీరా షేక్​.. హీరా గోల్డ్​ పేర వేర్వేరు రాష్ట్రాలకు చెందిన లక్షా 72వేల మంది నుంచి అక్రమంగా రూ. 5,600 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏటా 36 శాతం లాభాలు ఇస్తామని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో యధేచ్ఛగా మోసాలు సాగించింది. ఈ క్రమంలో నౌషీరా షేక్​ పై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఆమె మనీలాండరింగ్​ కు పాల్పడినట్టుగా ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

డిజిటల్ ఆధారాలు సీజ్

దర్యాప్తులో భాగంగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో కొల్లగొట్టిన వేలాది కోట్ల రూపాయలను నౌహీరా షేక్​ విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నౌషీరా షేక్‌ తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద ఉన్న రూ.45 కోట్లు విలువ చేసే 13 ఆస్తులు పత్రాలు, బినామీల పేర ఉన్న రూ. 25 కోట్ల విలువైన 11 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సీజ్​ చేశారు.

రూ.400 కోట్ల ఆస్తులు అటాచ్..

Advertisement

అదే సమయంలో వేల కోట్ల డబ్బు గోల్​ మాల్ కేసులో నౌహీరా షేక్ కు చెందిన రూ. 400 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేశారు. వీటిని వేలం వేయటం ద్వారా వచ్చే డబ్బును బాధితులకు అందచేయాలని ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే నౌషీరాను అరెస్టు చేశారు. అప్పట్లో సుప్రీం కోర్టు అయిదు షరతులతో బెయిల్ కూడా మంజూరు చేసింది. ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని పేర్కొంది.

Also Read: AC vs Cooler: కూలింగ్ పరంగా కాదు.. ఆరోగ్యం పరంగా.. రెండింట్లో ఏది బెస్ట్?

అద్దె ఇంట్లో.. నకిలీ పేరుతో మకాం

సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నౌషీరా షరతులు ఉల్లఘించడంతో ఆమెకు మంజూరైన బెయిల్ ను కొంత కాలం క్రితం న్యాయస్థానం రద్దు చేసింది. అప్పటి నుంచి నౌషీరా షేక్​ పరారీలో ఉంది. కాగా, ఆమె గుర్గావ్​ లో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నకిలీ పేరు, ఫోర్జరీ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఉపయోగించి మారు పేరుతో ఉంటున్నట్టు సమాచారాన్ని సేకరించిన ఈడీ హైదరాబాద్​ జోనల్ బృందం.. శుక్రవారం ఉదయం నౌషీరా షేక్ ను అరెస్ట్​ చేసింది. ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకువచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించి కోర్టులో హాజరు పరిచి రిమాండ్​ తరలించనున్నారు.

Also Read: BSNL బంపరాఫర్.. ఫ్రీ సిమ్, కాల్స్, రోజూ 2GB డేటా.. మే 31 వరకే ఛాన్స్

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×